జేఈఈలో విజయానికి ఐఐటీల కోచింగ్ | JEE success IIT Coaching | Sakshi
Sakshi News home page

జేఈఈలో విజయానికి ఐఐటీల కోచింగ్

Published Sun, Nov 20 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

జేఈఈలో విజయానికి ఐఐటీల కోచింగ్

జేఈఈలో విజయానికి ఐఐటీల కోచింగ్

 ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్, ఐదేళ్ల డ్యుయెల్ డిగ్రీ (బీటెక్+ఎంటెక్) కోర్సుల్లో ప్రవేశానికినిర్వహించే పరీక్షలు.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్, అడ్వాన్‌‌సడ్. ఇవి జాతీయ స్థాయిలోలక్షల మంది పోటీపడే పరీక్షలు. ఇంటర్మీడియెట్ ఎంపీసీలో చేరిన తొలి రోజు నుంచే జేఈఈలోవిజయం దిశగా చాలామంది శిక్షణ తీసుకుంటారు. అయితే వీరిలో కొంతమందికి మాత్రమేసీటు ఖరారవుతుంది. 
 
 మిగిలినవారికి నిరాశే మిగులుతుంది. ఈ పరిస్థితికి పరిష్కారం చూపేదిశగా ఐఐటీలే స్వయంగా కదులుతున్నాయి. జేఈఈ విద్యార్థుల కోసం నిపుణులైన ప్రొఫెసర్లతోశిక్షణనిప్పించేందుకు శ్రీకారం చుట్టాయి. దూరదర్శన్ చానల్‌తోపాటుమరో ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసంప్రత్యేకంగా ఐఐటీ-పాల్ (PAL - Professor AssistedLearning) పేరుతో ఈ ప్రోగ్రామ్‌ను అమలు చేయనున్నాయి.వచ్చే ఏడాది (2017) జనవరి నుంచి అమల్లోకిరానున్న ఈ పథకం విధివిధానాలపై విశ్లేషణ..
 
 జేఈఈలో విజయం సాధించాలంటే కోచింగ్ తప్పనిసరి. శిక్షణ లేకుంటే  పరీక్షలో ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేమనేది చాలా మంది అభిప్రాయం. దీంతో ఉన్నత వర్గాలు, ఎగువ మధ్య తరగతి కుటుంబాల పిల్లలు లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్నారు. అంత ఖర్చు చేసినా, కంటి మీద కునుకులేకుండా కష్టపడినా ఐఐటీల్లో సీట్లు లభించేది కొందరికే. 
 
 ఐఐటీ జేఈఈ కోచింగ్ సౌకర్యాలు పట్టణ ప్రాంతాలకే పరిమితం. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సైతం ఇవి అందేలా చేయాలి. ముఖ్యంగా లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకునే సామర్థ్యం లేని వర్గాలు, సుదూర ప్రాంతాలకు వెళ్లలేని గ్రామీణ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పరిష్కారం చూపాలనేది వివిధ వర్గాల అభిప్రాయం.
 
 ఐఐటీ పాల్ అంటే
 జాతీయ స్థాయిలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష..  జేఈఈ. దీన్ని రెండు దశల్లో నిర్వహిస్తారు.  మొదటి దశ జేఈఈ మెయిన్.. రెండో దశ.. జేఈఈ అడ్వాన్‌‌సడ్. మెయిన్ ర్యాంకుతో 31 ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశం పొందొచ్చు. అడ్వాన్‌‌సడ్ ద్వారా 22 ఐఐటీల్లో చేరొచ్చు. జేఈఈకి దేశవ్యాప్తంగా లక్షల మంది పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. కానీ సీట్లు  ఐఐటీల్లో పదకొండు వేల లోపు, ఎన్‌ఐటీల్లో 30 వేల లోపు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంత పోటీ ఉన్న పరీక్షలో విజయం దిశగా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వం తరఫున ఐఐటీలు చేపడుతున్న కొత్త కార్యక్రమమే ఐఐటీ - పాల్ (ప్రొఫెసర్ అసిస్టెడ్ లెర్నింగ్). 
 
 జనవరి, 2017 నుంచి అమలు కానున్న ఈ ప్రోగ్రామ్ ద్వారా దేశంలోని నలుమూలల ఉన్న జేఈఈ ఔత్సాహిక విద్యార్థులకు ఐఐటీలకు చెందిన ప్రొఫెసర్ల పాఠాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రోగ్రామ్‌కు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సైతం ఆమోదం తెలిపింది. ఐఐటీ - పాల్ తీరుతెన్నులను పరిశీలిస్తే.. ఐఐటీ ఢిల్లీ ఈ ప్రోగ్రామ్ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టనుంది. దీంతోపాటు పాత ఐఐటీలుగా పిలిచే కాన్పూర్, ఖరగ్‌పూర్, చెన్నై, బాంబే, గువహటిలు ఐఐటీ-పాల్‌లో భాగస్వాములుగా నిలవనున్నాయి. 
 
 4.. 40.. 200.. ఐఐటీ- పాల్ నిర్వహణ ఇలా
 ఐఐటీ - పాల్ ప్రోగ్రామ్‌లో భాగంగా పదకొండు, పన్నెండు (ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్, సెకండియర్) తరగతుల విద్యార్థులకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో శిక్షణ లభించనుంది. ఇందుకోసం ఆయా ఐఐటీలకు చెందిన 40 మంది ప్రొఫెసర్ల బృందం ఏర్పాటు కానుంది. ఒక్కో సబ్జెక్ట్‌లో 200 గంటల చొప్పున లెక్చర్చ్ అందుబాటులో ఉంటాయి. ఈ రెండు వందల గంటల వ్యవధిలో అందించే లెక్చర్స్‌లోనే +2 స్థాయి సిలబస్, జేఈఈ సిలబస్‌కు సంబంధించి పాఠాలు మొత్తం లభించేలా ఏర్పాట్లు చేయనున్నారు. నిపుణులైన ప్రొఫెసర్లతోపాటు ఎన్‌సీఈఆర్‌టీ, కేంద్రీయ విద్యాలయాలకు చెందిన అధ్యాపకులు సైతం ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి శిక్షణ తరగతులు బోధించనున్నారు.
 
 అన్ని ప్రాంతాల విద్యార్థులకు చేరే మార్గంఐఐటీ-పాల్ ప్రోగ్రామ్ ద్వారా జేఈఈ శిక్షణ తరగతులు దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులకు చేరడం ఎలా? అంటే.. ఇందుకు ప్రధానంగా రెండు మార్గాలను ఐఐటీలు ఎంపిక చేసుకున్నాయి. అవి.. జనవరి 2017 నుంచి దూరదర్శన్ చానల్ ద్వారా నిర్దేశిత సమయంలో నిర్దిష్ట కాల వ్యవధిలో క్రమం తప్పకుండా ప్రసారం చేయనున్నాయి. దూరదర్శన్ చానల్‌కు అన్ని ప్రాంతాల్లో కనెక్టివిటీ ఉండటంతోపాటు ప్రసారాల పరంగా ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో దీన్ని ఎంచుకున్నాయి.
 
  దీనివల్ల గ్రామీణ విద్యార్థులకు సైతం ఇది చేరుతుంది. ఇక.. రెండో మార్గం.. ఒక ప్రత్యేక వెబ్‌పోర్టల్ రూపొందించడం. అందులోనూ ప్రీ రికార్డెడ్ లెక్చర్స్‌ను పొందుపర్చడం. అయితే ఈ విధానం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంత విద్యార్థులకు కొంత ఎక్కువ అనుకూలం అని చెప్పొచ్చు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం, బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాలు ఉన్నా అవి పరిమితంగా ఉండటమే దీనికి కారణం.
 
 మూస శిక్షణకు భిన్నంగా
 ఐఐటీ-పాల్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం.. జేఈఈకి హాజరయ్యే విద్యార్థులను మూస పద్ధతిలో అనుసరిస్తున్న కోచింగ్ విధానం నుంచి విముక్తి కల్పించడం. ప్రస్తుతం వివిధ శిక్షణ కేంద్రాల్లో కోచింగ్‌తీసుకుంటున్న విద్యార్థులను పరిశీలిస్తే.. కేవలం సిలబస్ ఆధారంగా ఆన్సర్ టు కొశ్చన్ మాదిరిగా బట్టీ విధానంలో శిక్షణనిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. విద్యార్థులు సైతం జేఈఈలో ర్యాంకులే లక్ష్యంగా సబ్జెక్ట్‌కు సంబంధించిన బేసిక్ నైపుణ్యాల సాధనను విస్మరిస్తున్నారు. దీని కారణంగానే ఐఐటీల్లో ప్రవేశించాక అక్కడ భిన్నంగా ఉండే బోధన విధానాల్లో ఇమడలేకపోతున్నారు. కొన్నిసార్లు ఒత్తిడికి లోనై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వీటన్నిటికీ పరిష్కారం చూపేలా, విభిన్నంగా, వినూత్నంగా ఐఐటీ-పాల్‌లో లెక్చర్స్ లభించనున్నాయి. వీటి ద్వారా వివిధ సబ్జెక్టులకు సంబంధించి ప్రాథమిక భావనలు, వాటిని అన్వయించే విధానం, సమస్యలను పరిష్కరించే క్రమంలో అనుసరించాల్సిన పద్ధతులు, వాటికి సబ్జెక్ట్ పరంగా ఉన్న మూలాల గురించి బోధిస్తారు. దీనివల్ల ప్రశ్న ఎలా అడిగినా సమాధానం ఇచ్చే నైపుణ్యం లభిస్తుంది. 
 
 గ్రామీణ విద్యార్థులకు ఎంతో మేలు
 ఐఐటీ-పాల్.. ప్రధానంగా గ్రామీణ విద్యార్థులకు అత్యంత ప్రయోజనకరంగా ఉండనుంది. అదేవిధంగా శిక్షణ కోసం రూ. లక్షలు వెచ్చించలేని పేద, మధ్య తరగతి వర్గాలకు సైతం ఇది ఉపయుక్తంగా మారనుంది. 2014లో ఐఐటీల్లో మొత్తం 9784 సీట్లు అందుబాటులో ఉండగా.. గ్రామీణ నేపథ్యం, కుటుంబ వార్షికాదాయం రూ. లక్ష లోపు ఉన్న విద్యార్థుల సంఖ్య రెండు వేల లోపుగా నమోదైంది.
 
  2015లో అందుబాటులో ఉన్న 9974 సీట్లలో 25 శాతం సీట్లు గ్రామీణ విద్యార్థులు సొంతం చేసుకోగా, వారిలో కుటుంబ వార్షికాదాయం రూ. లక్షలోపు ఉన్న వారి సంఖ్య 1600 వరకు ఉంది. ఈ గణాంకాలను విశ్లేషిస్తే.. ఐఐటీ-పాల్‌తో శిక్షణనందించడం ద్వారా మరింత మంది గ్రామీణ విద్యార్థులకు మేలు చేయొచ్చు. ప్రైవేట్ కోచింగ్‌కు డబ్బులు చెల్లించలేని వారికి లబ్ధి చేకూర్చవచ్చని ఐఐటీ వర్గాలు భావిస్తున్నాయి.
 
 ఆహ్వానించదగ్గ పరిణామం
 ఐఐటీ పాల్.. మరో ప్రధాన ఉద్దేశం రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఏటా రూ. వందల కోట్ల స్థాయికి చేరిన శిక్షణకు స్వస్తి పలకడం. ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రాథమిక భావనలు, అన్వయ సామర్థ్యం పెరిగేలా బోధన చేయాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని నిపుణులు అంటున్నారు. అయితే ఈ విధానంలో స్టూడెంట్- ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ లేకపోవడం లోపంగా పలువురు పేర్కొంటున్నారు. అందుకు పరిష్కారంగా సంబంధిత టాపిక్‌కు సంబంధించి లోతైన ప్రశ్నల సాధన దిశగా రెగ్యులర్ మెంటారింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 
 
 మరికొద్ది రోజుల్లో పూర్తి వివరాలు..
 ఐఐటీ - పాల్‌కు సంబంధించి మరో వారం రోజుల్లో పూర్తి విధి విధానాలు ఖరారు కానున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సహజమే. కానీ మేం కొన్ని నెలలపాటు కసరత్తు చేసిన తర్వాతే ఈ ప్రోగ్రామ్ అమలుకు చర్యలు చేపట్టాం. మా ప్రణాళికల ప్రకారం ఇది కచ్చితంగా గ్రామీణ విద్యార్థులకు, శిక్షణ తరగతులకు వెళ్లలేని వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జేఈఈ పరీక్షల్లో విజయం సాధించేందుకు ఉపయోగపడుతుంది.
 - వి. రామ్‌గోపాలరావు,
 డెరైక్టర్, ఐఐటీ - ఢిల్లీ 
 
 ఇన్‌క్లూజివ్ గ్రోత్ పెరిగే అవకాశం
 ఐఐటీ-పాల్ కచ్చితంగా మేలు చేస్తుంది. దీనివల్ల ఐఐటీల్లో అన్ని వర్గాల విద్యార్థుల ప్రాతినిధ్యం పెరుగుతుంది. అదేవిధంగా ఎన్‌రోల్‌మెంట్ పరంగా ఇన్‌క్లూజివ్ గ్రోత్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా ఉండేలా ఐఐటీ - పాల్ ద్వారా శిక్షణ అందిస్తాం. మెరుగైన బోధన పద్ధతులు అనుసరిస్తాం. ఇందులో స్టూడెంట్- ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఉండదనే అభిప్రాయం వాస్తవమే. అయితే ప్రీ రికార్డెడ్ లెక్చర్స్‌ను రూపొందించేటప్పుడే ప్రొఫెసర్లు ఒక టాపిక్‌ను భిన్న కోణాల్లో బోధిస్తారు. సందేహ నివృత్తి చేసే విధంగా లెక్చర్‌‌స ఉంటాయి.       - ప్రొఫెసర్ ఆర్.వి.రాజ్‌కుమార్
      డెరైక్టర్, ఐఐటీ-భువనేశ్వర్
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement