ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, నీట్, జేఈఈలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందిస్తోందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులతో పాటు ప్రైవేటు కళాశాలల వారు కూడా వినియోగించుకోవాలని కోరారు. శుక్రవారం తన కార్యాలయంలో షార్ట్ టైం ఆన్‌లైన్ కోచింగ్‌ను మంత్రి ప్రారంభించారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. http://tscie.rankr.io లింక్ ద్వారా ఆన్‌లైన్ కోచింగ్ పొందవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment