
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గమనిస్తుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇదే సమయంలో తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాను అంటూ కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబిత ట్విట్టర్ వేదికగా..‘రేవంత్ రెడ్డి గారు ఆత్మ అభిమానం కన్నా మించిన ఆస్తి లేదని నమ్ముతున్న వ్యక్తిని నేను. మీ ముందు కానీ మరి ఇంకెవరు ముందులో కానీ 'పేద ఏడుపులు' ఏడ్చిన సందర్భం నాకు ఆ దేవుడు కలిగియలేదు. మిమ్మల్ని, మీ మాట తీరుని ఈ తెలంగాణ సమాజం గమనిస్తుంది, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.
రేవంత్ రెడ్డి గారు ఆత్మ అభిమానం కన్నా మించిన ఆస్తి లేదని నమ్ముతున్న వ్యక్తిని నేను. మీ ముందు కానీ మరి ఇంకెవరు ముందులో కానీ 'పేద ఏడుపులు' ఏడ్చిన సందర్భం నాకు ఆ దేవుడు కలిగియలేదు. మిమ్మల్ని, మీ మాట తీరుని ఈ తెలంగాణ సమాజం గమనిస్తుంది, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. Cont
— Sabitha Reddy (@BrsSabithaIndra) October 3, 2024
మా అబ్బాయి కడుతున్న 'ఇల్లు' మినాయించి, మిగతా మూడు 'ఫామ్ హౌస్ లు' ఎక్కడున్నాయి అనే వివరాలు ప్రజల ముందు పెట్టండి. మీరు ఎన్ని రకాలుగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాను అంటూ’ కామెంట్స్ చేశారు.
మా అబ్బాయి కడుతున్న 'ఇల్లు' మినాయించి, మిగతా మూడు 'ఫామ్ హౌస్ లు' ఎక్కడున్నాయి అనే వివరాలు ప్రజల ముందు పెట్టండి. మీరు ఎన్ని రకాలుగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాను.
— Sabitha Reddy (@BrsSabithaIndra) October 3, 2024
ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment