సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం ధర పెరిగింది. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు అని చెబుతూ గతంలో మాదిరి ఈసారి కూడా ధరలు పెంచేశారు. రూ.30 ఉన్న టికెట్‌ను రూ.50కి దక్షిణ మధ్య రైల్వే పెంచేసింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా స్టేషన్‌లో రద్దీని నియత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది. లాక్‌డౌన్ మళ్లీ విధిస్తారేమోననే భయంతో ప్రజలు, వలస కార్మికులు ఇళ్ల బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రయాణం టికెట్ కన్నా ప్లాట్‌ఫాం టికెట్ అధికంగా ఉందని ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment