సాక్షి, అనంతపురం : బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు బీ-1 బోగీలో ప్రయాణిస్తున్న వ్యక్తుల వల్లే బోగీ తగలబడి 26 మంది మృతి చెందారని సరిగ్గా నెల రోజులకు ప్రాథమికంగా నిర్ధారించారు. డిసెంబర్ 28న కొత్తచెరువు సమీపంలో నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇపుడు ఆ ప్రమాదం జరగడానికి కారకులు ఎవరనేది నిగ్గు తేల్చాల్సి ఉంది. ఆ వ్యక్తులను గుర్తిస్తారా లేక విచారణ పేరుతో కాలయాపన చేస్తారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బీ-1 బోగీలో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు లేదా ప్రయాణీకుల తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు తన విచారణలో తేలిందని బెంగళూరులోని రైల్వే సేఫ్టీ సౌత్ సర్కిల్ కమిషనర్ సతీష్ కుమార్ మిట్టల్.. లక్నోలోని రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు బుధవారం వెల్లడైంది. పేలుడు, విద్రోహ చర్య కారణం కాదని, ప్రయాణీకులు ఆక్సిజన్ లేని వాయువుని పీల్చడం వల్లే మృతి చెందినట్లు తెలుస్తోందని నివేదికలో పేర్కొన్నారు.
సతీష్ కుమార్ మిట్టల్‌తో పాటు చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ విక్రాంత్ కల్రా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఏసీ రైల్వే బోర్డు డెరైక్టర్ జైదీప్, ఆర్డీఎస్‌ఓ డెరైక్టర్ ఎం.జమాలి, చీఫ్ ఎలక్ట్రికల్ సర్వీస్ ఇంజనీర్ వి.వి.కోకటే, ట్రాక్స్‌మిషన్ చీఫ్ ఇంజనీర్ రాంగోపాల్, చీఫ్ కమర్షియల్ మేనేజర్ అనిల్ పవిత్రాన్, చీఫ్ వర్క్‌షాప్ ఇంజనీర్ టి.వి.సుబ్బారావు, బెంగళూరు డివిజనల్ రైల్వే మేనేజర్ అనిల్ కుమార్ అగర్వాల్‌తో కలిసి డిసెంబర్ 31, జనవరి ఒకటో తేదీన రెండు రోజుల పాటు ప్రమాదం జరిగిన ప్రాంతంలో విచారణ నిర్వహించారు. విచారణ సమయంలో స్థానికంగా వున్న స్టేషన్ మేనేజర్‌తో పాటు ఇతర రైల్వే సిబ్బంది సరిగా సమాచారం ఇవ్వలేదని నివేదికలో వివరించారు. మృతులతో పాటు క్షతగాత్రుల వివ రాలు ఇవ్వాలని పలుమార్లు అడిగినా పెద్దగా స్పందించలేదని చెప్పారు.
ఎవరా వ్యక్తులు?
Published Thu, Jan 30 2014 2:21 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement