అనంతపురం ఎడ్యుకేషన్ :
ఈనెల 31న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎ.కళ్యాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరుకు చెందిన అపోలో హోం హెల్త్ కేర్ లిమిటెడ్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు, అనంతపురం వినూత్న ఫర్టిలైజర్స్ కంపెనీలో సేల్స్ రెప్రజెంటేటివ్స్ ఉద్యోగాలకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ చేసిన వారు అర్హులన్నారు. వయస్సు 18–32 ఏళ్లలోపు ఉండాలని, మొత్తం ఖాళీలు 50 ఉంటాయన్నారు.నెలకు రూ.15 వేలు వేతనంతో బెంగళూరులోనే పని చేయాల్సి ఉంటుందన్నారు. సేల్స్ రెప్రజెంటేటివ్ ఉద్యోగాలకు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చేసిన వారు అర్హులని, వయసు 19–30 ఏళ్లలోపు ఉండాలన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 31న ఉదయం 10.30 గంటలకు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లతో ఎంప్లాయింట్ కార్యాలయానికి రావాలన్నారు.