employment officer
-
కనీస సమాచారం లేకపోతే ఎలా..!
నిజామాబాద్‌అర్బన్: జిల్లా ఉపాధి కల్పన అధికారి మోహన్‌లాల్ తీరుపై జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్‌రావు, స్థాయీ సంఘ సభ్యులు మండిపడ్డారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో స్థాయీసంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కల్పన శాఖపై సమీక్ష నిర్వహించారు. శాఖ ద్వారా చేపడుతున్న విధానాలను పేర్కొనాలని చైర్మన్ ఆదేశించారు. సం బంధిత అధికారి వద్ద ఎలాంటి సమాచారం లేకపోవడంతో సమాధానం చెప్పలేకపోయారు. దీంతో చైర్మన్ సమావేశానికి వచ్చేటప్పుడు ఇలా గేనా వస్తారా అని ప్రశ్నించారు. ఎంప్లాయీమెం ట్ కార్యాలయంలో ఎన్ని ఏజెన్సీలు కొనసాగుతున్నాయి. ఐదేళ్ల నుంచి ఎందుకు టెండర్లు వే యడం లేదంటూ ప్రశ్నించారు. తక్షణమే అన్ని వివరాలను సమర్పించాలని ఆదేశించారు. అనంతరం గ్రామీణాభివృద్ధి శాఖపై జరిగిన సమీక్షలో ప్రతి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేయడం, మొక్కల పెంపకాన్ని పకడ్బందీగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పరిశ్రమల శాఖ నుంచి ఇప్పటి వరకు ఎంత మందికి సబ్సిడీ రుణాలు ఇచ్చారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం వ్యవసాయంపై సమీక్ష సమావేశం జరిగింది. రైతు బంధు పథకం అమలు, ప్రస్తుతం ఖరీఫ్‌కు పంటకు సంబంధించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. సమావేశంలో వైస్‌చైర్మన్ రజిత, సభ్యులు అధికారులు పాల్గొన్నారు. -
31న జాబ్‌మేళా
అనంతపురం ఎడ్యుకేషన్ : ఈనెల 31న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎ.కళ్యాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరుకు చెందిన అపోలో హోం హెల్త్ కేర్ లిమిటెడ్‌లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు, అనంతపురం వినూత్న ఫర్టిలైజర్స్ కంపెనీలో సేల్స్ రెప్రజెంటేటివ్స్ ఉద్యోగాలకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ చేసిన వారు అర్హులన్నారు. వయస్సు 18–32 ఏళ్లలోపు ఉండాలని, మొత్తం ఖాళీలు 50 ఉంటాయన్నారు.నెలకు రూ.15 వేలు వేతనంతో బెంగళూరులోనే పని చేయాల్సి ఉంటుందన్నారు. సేల్స్ రెప్రజెంటేటివ్ ఉద్యోగాలకు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చేసిన వారు అర్హులని, వయసు 19–30 ఏళ్లలోపు ఉండాలన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 31న ఉదయం 10.30 గంటలకు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లతో ఎంప్లాయింట్ కార్యాలయానికి రావాలన్నారు. -
రేపు జాబ్‌మేళా
కర్నూలు(హాస్పిటల్): స్టార్స్ ఆఫ్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్‌లో మార్కెటింగ్ టీమ్ ఉద్యోగాల కోసం ఈ నెల 9వ తేదీ ఉదయం 10.30 నుంచి జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తామని జిల్లా ఉపాధి అధికారి పి. ప్రతాపరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిప్యూటీ జనరల్ మేనేజర్స్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్స్, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్స్, మార్కెటింగ్ మేనేజర్స్, సేల్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు 18 ఏళ్లు పైబడ్డ యువకులు అర్హులన్నారు. ఎంపికైన వారికి రూ.8వేలకుపైగా జీతం చెల్లిస్తారని, కర్నూలు జిల్లాలోనే పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. -
రేపు జాబ్‌మేళా
అనంతపురం టౌన్ : అనంతపురంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 23న వినూత్న ఫర్టిలైజర్స్ తరఫున జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కల్పన తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. సేల్స్ రెప్రజెంటేటివ్ ఉద్యోగం కోసం టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 18 నుంచి 25 ఏళ్లలోపు ఉన్న వారు విద్యార్హత పత్రాలతో ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలన్నారు. మొత్తం 30 మందిని ఎంపిక చేస్తామని, నెలకు రూ.7,500 జీతం ఉంటుందని పేర్కొన్నారు.