రేపు జాబ్‌మేళా | tomarrow job mela | Sakshi
Sakshi News home page

రేపు జాబ్‌మేళా

Published Fri, Jul 22 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

tomarrow job mela

అనంతపురం టౌన్‌ :
అనంతపురంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 23న వినూత్న ఫర్టిలైజర్స్‌ తరఫున జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కల్పన తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
 
సేల్స్‌ రెప్రజెంటేటివ్‌ ఉద్యోగం కోసం టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 18 నుంచి 25 ఏళ్లలోపు ఉన్న వారు విద్యార్హత పత్రాలతో ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలన్నారు. మొత్తం 30 మందిని ఎంపిక చేస్తామని, నెలకు రూ.7,500 జీతం ఉంటుందని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement