
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ టెస్టులో టీమిండియాకు ట్రావిస్ హెడ్ 'హెడేక్' తప్పింది. ఈ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హెడ్ డకౌటయ్యాడు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అద్బుతమైన బంతితో హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
దీంతో అతడు ఏడు బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 67వ ఓవర్ వేసిన బుమ్రా మూడో బంతిని హెడ్‌కు ఆఫ్ స్టంప్ దిశగా గుడ్-లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే ఆ బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన హెడ్ వెనక్కి విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు.
కానీ వైడ్ ఆఫ్ స్టంప్ వెలుపుల పడ్డ బంతి అద్బుతంగా స్వింగ్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. బుమ్రా దెబ్బకు హైడ్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌పై ట్రావిస్ హెడ్ డకౌట్ కావడం ఇదే తొలిసారి. ఇక ఈ సిరీస్‌లో ఇప్పటికే హెడ్ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలి మూడు టెస్టుల్లో హెడ్ రెండు సెంచరీలను నమోదు చేసి భారత్‌కు తల నొప్పిగా మారాడు.
ఈ క్రమంలో నాలుగో టెస్టులో హెడ్ డకౌట్ కావడం భారత్ కలిసొచ్చే ఆంశంగా చెప్పాలి. ఇక 83 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.
What a sight for an Indian fan!!!
Watch on loop! #Jaspritbumrah𓃵#INDvsAUS#BGT2024
pic.twitter.com/DMLC4eCyox— Cricketwood (@thecricketwood) December 26, 2024
చదవండి: #Virat Kohli: యువ క్రికెటర్‌తో గొడవ.. విరాట్ కోహ్లికి ఐసీసీ భారీ షాక్