సాక్షి, పెద్దపల్లి : ‘ఎంత పనాయేరా కొడుకా.. నువు లేక మేము బతుకుడెట్లా’ అని విశాల్ తల్లిదండ్రులు, సోదరి రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. సోమవారం పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ క్రాసింగ్ కోసం ఆగిన సమయంలో రైలు దిగిన విశాల్(21)ను సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడంతో మృతి చెందిన ఘటన పెద్దపల్లిలో జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ తిరుపతి కథనం ప్రకారం.. మందమర్రి సింగరేణి బొగ్గుగని వర్క్‌షాప్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్–పద్మావతి దంపతులకు కుమారుడు విశాల్, కూతురు ఉన్నారు. కూతురు హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ చదువుతోంది. సెలవులు రావడంతో ఇంటికి తీసుకొచ్చేందుకు తండ్రి శ్రీనివాస్ బయల్దేరగా లగేజీ ఎక్కువగా ఉంటుందని విశాల్, తల్లి పద్మావతి సైతం బయల్దేరారు. హైదరాబాద్ నుంచి కాగజ్‌నగర్ రైల్లో సోమవారం ఇంటికి బయల్దేరారు.
ప్రాణం తీసిన క్రాసింగ్..
పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు క్రాసింగ్ కోసం ఆగడమే విశాల్ ప్రాణాలను తీసిందా.. అనే భావన అందరిలో నెలకొంది. పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో ఆగిన రైలు నుంచి దిగిన విశాల్ పక్కనే ఉన్న పట్టాలపైకి వెళ్లిన సమయంలో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు రావడంతో ప్రమాదం జరిగింది.
చదవండి:
డెలివరీకి డబ్బు కావాలి, డ్రాప్ చేయాలని అడిగింది.. ఆపై
బస్సు టైరు పేలడంతో ఘోర ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment