మావోల కాల్పుల్లో ముగ్గురు జీఆర్‌పీ జవాన్ల మృతి
ముంగేర్: బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో శనివారం ఓ ఎక్స్‌ప్రెస్ రైలుపై మావోయిస్టులు దాడిచేసి జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రభుత్వ రైల్వే పోలీసు(జీఆర్‌పీ) జవాన్లు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సాయంత్రం 5:45 గంటలకు సాహెబ్‌గంజ్-పాట్నా ఇంటర్-సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు జమాల్‌పూర్, ఆశిక్‌పూర్‌ల మధ్య ఓ సొరంగం, బ్రిడ్జిల మధ్య రైలు వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. మరణించిన, గాయపడిన జవాన్ల నుంచి మూడు ఇన్సాస్ రైఫిళ్లు, ఒక స్టెన్ గన్, ఏకే-47, 460 బుల్లెట్లను నక్సల్స్ దోచుకుని, పారిపోయారని జమాల్‌పూర్ రైల్వే ఎస్పీ అమితాబ్ కుమార్ తెలిపారు.
కాల్పుల్లో హవల్దార్ అశోక్ కుమార్, కానిస్టేబుళ్లు భోలా ఠాకూర్, ఉదయ్‌సింగ్‌లు మరణించారని, వీరితోపాటు గాయపడిన ఇద్దరు జవాన్లూ బీహార్ మిలిటరీ పోలీస్(బీఎంపీ) 12వ యూనిట్‌కు చెందినవారని పేర్కొన్నారు. 8 నుంచి 10 మంది వరకూ మావోయిస్టులు జమాల్‌పూర్‌లో రైలు ఎక్కారని దాడిలో గాయపడ్డ జవాను ఒకరు తెలిపారు. రైలులోని మావోలు పాసిఖానా వద్ద చైను లాగడంతో రైలు ఆగిందని, దాంతో పట్టాల వెంబడి దాక్కున్న మావోయిస్టు మహిళల బోగీలో రక్షణగా ఉన్న జవాన్లపై కాల్పులు జరిపారని చెప్పారు.
రైలుపై మావోయిస్టుల దాడి
Published Sun, Dec 1 2013 2:00 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement