పట్నా : బిహార్‌లో మావోయిస్టులు అర్థరాత్రి ఘాతుకానికి పాల్పడ్డారు. మసుదన్ రైల్వేస్టేషన్‌పై దాడి చేసి అయిదుగురు రైల్వే సిబ్బందిని కిడ్నాప్ చేశారు. అనంతరం రైల్వేస్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కమ్యూనికేషన్ విభాగంతో పాటు, వస్తు సామాగ్రి దగ్ధమైంది. అపహరణకు గురైనవారిలో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ కూడా ఉన్నారు. వీరిలో ముగ్గురిని పోలీసులు రక్షించారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment