torched
-
మహారాష్ట్రలో మళ్లీ రిజర్వేషన్ ‘మంటలు’
మహారాష్ట్రలో మరోమారు రిజర్వేషన్ ‘మంటలు’ రాజుకున్నాయి. అంబాద్ తాలూకాలోని తీర్థపురి పట్టణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద మరాఠా నిరసనకారులు రాష్ట్ర రవాణా బస్సును తగులబెట్టారని ఒక అధికారి తెలిపారు. దీనిపై మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్టీసీ) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపధ్యంలో జల్నా ప్రాంతంలో బస్సు సేవలను నిలిపివేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మరాఠా ఆందోళనకారులు బస్సును తగులబెట్టారని ఆరోపిస్తూ ఎంఎస్ఆర్టీసీ అంబాద్ డిపో మేనేజర్ స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మరాఠా రిజర్వేషన్ బిల్లును మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ప్రకారం మరాఠాలకు 50 శాతం పరిమితిని మించి అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఫిబ్రవరి 20న అసెంబ్లీలో కోటా బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ తన దీక్షను విరమించలేదు. పైగా ఈ ఆర్డినెన్స్ నోటిఫికేషన్‌ను రెండు రోజుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 24న రాష్ట్రంలో మరో ఉద్యమం ప్రారంభమయ్యింది. తాజాగా మనోజ్ జరంగే మాట్లాడుతూ మరాఠా కమ్యూనిటీకి అందిస్తాన్న రిజర్వేషన్ సంతృప్తికరంగా లేదని అన్నారు. -
అర్థరాత్రి మావోయిస్టుల ఘాతుకం
పట్నా : బిహార్‌లో మావోయిస్టులు అర్థరాత్రి ఘాతుకానికి పాల్పడ్డారు. మసుదన్ రైల్వేస్టేషన్‌పై దాడి చేసి అయిదుగురు రైల్వే సిబ్బందిని కిడ్నాప్ చేశారు. అనంతరం రైల్వేస్టేషన్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో కమ్యూనికేషన్ విభాగంతో పాటు, వస్తు సామాగ్రి దగ్ధమైంది. అపహరణకు గురైనవారిలో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ కూడా ఉన్నారు. వీరిలో ముగ్గురిని పోలీసులు రక్షించారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒక్క రాత్రిలో 86 బైక్‌లను తగలబెట్టారు
పుణె: ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 86 టూవీటర్స్ను రాత్రికిరాత్రే ఒక్క రాత్రిలో 86 బైక్‌లను తగలబెట్టారు గుర్తుతెలియని దుండగులు. పుణెలోని సన్ సిటీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. దాదాపు మూడు, నాలుగు గంటల ప్రాంతంలో సన్ సిటీ వద్దకు చేరుకున్న దుండగులు వివిధ అపార్ట్మెంట్లు, షాపుల ముందు నిలిపి ఉంచిన వాహనాల పెట్రోల్ పైపును తొలిగించి నిప్పుపెట్టినట్లు స్థానిక ఇన్స్పెక్టర్ కషిద్ చెప్పారు. చుట్టూ మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన స్థానికులు తమకు సమాచారం అందిచారని, ఓ పిజ్జా షాపు వద్ద అధికంగా 25 వాహనాల తగలబడ్డాయని కషిద్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజిల ఆధారంగా ఈ ఘటనలో ప్రమేయం ఉందని భావిస్తున్న ఓ యువకుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొద్ది నెలల కిందట ధంన్కావాడీ ప్రాంతంలోనూ ఇదే తరహా ఘటనలు జరగడం గమనార్హం.