కేంద్ర బడ్జెట్ 2025-26 సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కీలక విషయాన్ని ప్రకటించారు. బిహార్ (Bihar)పై వరాల జల్లు కురిపించిన ఆర్థికమంత్రి అక్కడ మఖానా బోర్డు ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఫూల్ మఖానా (lotus seeds) పై ఆసక్తి ఏర్పడింది. మఖానాను ఫూల్ మఖానా, తామర గింజలు, ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తారు. అసలేంటి మఖానా ప్రత్యేకత, వీటివల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటి తెలుసుకుందామా!
బిహార్‌లో ఏర్పాటుచేయనున్న మఖానా బోర్డుతో అక్కడి రైతులకు మేలు చేయనుంది. దీని ద్వారా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయి. దీనికింద రైతులకు శిక్షణ అందుతుంది నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
మఖానా ప్రయోజనాలు
ఈ మధ్య కాలంలో ఆరోగ్యకరమైన డైట్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరుచక్కని పౌష్ఠికాహారం మఖానా. మఖానా గింజలను మన ఆహారంలో చేర్చుకోవడంవల్ల, బరువు తగ్గడంతోపాటు, షుగర్ గుండె జబ్బులున్నవారికి ఎంతో మేలు చేస్తుంది. బాదం, జీడిపప్పు,ఇతర డ్రై ఫ్రూట్స్, మఖానా పోషక విలువలు చాలా ఎక్కువ.
కార్బోహైడ్రేట్లు, ఐరన్ లభించే సూపర్ ఫుడ్. అందుకే మఖానా తినడం వల్ల ఏనుగు లాంటి శక్తి వస్తుందని నమ్ముతారు.
ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్‌లా పనిచేసే పాలీఫెనాల్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా లభిస్తాయనిచెబుతున్నారు నిపుణులు.
మఖానాల్లో మెగ్నీషియం ద్వారా ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఇది షుగర్ ఉన్నవారికి చాలా మంచిది.కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గుండె సమస్యలు తగ్గుతాయి.
మఖానా విత్తనాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. వీటిని తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. మఖానాలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లెవల్స్ ఉంటాయి.
కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్ల మూలం కాబట్టి మఖానాతో ఎముకళు, కీళ్లను బలపోతం చేస్తాయి. దంతాల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా మాఖానా పనిచేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా చాలామంచిది.
ఇందులోని థయామిన్ నరాల, అభిజ్ఞా పనితీరుకు మంచిది. న్యూరోట్రాన్స్మిషన్ ప్రక్రియకు దోహదం చేస్తుంది.
సంతానోత్పత్తికి మంచిది: మఖానా వంధ్యత్వ సమస్యలతో వ్యవహరించడంలో పురుషులు,మహిళలు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తుంది.
ఇవీ చదవండి: US Air Crash: పెళ్లి కావాల్సిన పైలట్, ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదం!
చిన్నపుడే పెళ్లి, ఎన్నో కష్టాలు, కట్ చేస్తే.. నిర్మలా సీతారామన్‌కు చేనేత పట్టుచీర
Comments
Please login to add a commentAdd a comment