lotus seeds
-
Union Budget 2025 మఖానా ట్రెండింగ్ : తడాఖా తెలిస్తే అస్సలు వదలరు!
కేంద్ర బడ్జెట్ 2025-26 సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కీలక విషయాన్ని ప్రకటించారు. బిహార్ (Bihar)పై వరాల జల్లు కురిపించిన ఆర్థికమంత్రి అక్కడ మఖానా బోర్డు ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఫూల్ మఖానా (lotus seeds) పై ఆసక్తి ఏర్పడింది. మఖానాను ఫూల్ మఖానా, తామర గింజలు, ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తారు. అసలేంటి మఖానా ప్రత్యేకత, వీటివల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటి తెలుసుకుందామా!బిహార్‌లో ఏర్పాటుచేయనున్న మఖానా బోర్డుతో అక్కడి రైతులకు మేలు చేయనుంది. దీని ద్వారా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడనున్నాయి. దీనికింద రైతులకు శిక్షణ అందుతుంది నిర్మలా సీతారామన్ ప్రకటించారు.మఖానా ప్రయోజనాలుఈ మధ్య కాలంలో ఆరోగ్యకరమైన డైట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరుచక్కని పౌష్ఠికాహారం మఖానా. మఖానా గింజలను మన ఆహారంలో చేర్చుకోవడంవల్ల, బరువు తగ్గడంతోపాటు, షుగర్ గుండె జబ్బులున్నవారికి ఎంతో మేలు చేస్తుంది. బాదం, జీడిపప్పు,ఇతర డ్రై ఫ్రూట్స్, మఖానా పోషక విలువలు చాలా ఎక్కువ.కార్బోహైడ్రేట్లు, ఐరన్ లభించే సూపర్ ఫుడ్. అందుకే మఖానా తినడం వల్ల ఏనుగు లాంటి శక్తి వస్తుందని నమ్ముతారు. ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్‌లా పనిచేసే పాలీఫెనాల్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా లభిస్తాయనిచెబుతున్నారు నిపుణులు.మఖానాల్లో మెగ్నీషియం ద్వారా ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఇది షుగర్ ఉన్నవారికి చాలా మంచిది.కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గుండె సమస్యలు తగ్గుతాయి.మఖానా విత్తనాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. వీటిని తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. మఖానాలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లెవల్స్ ఉంటాయి.కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్ల మూలం కాబట్టి మఖానాతో ఎముకళు, కీళ్లను బలపోతం చేస్తాయి. దంతాల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా మాఖానా పనిచేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా చాలామంచిది. ఇందులోని థయామిన్ నరాల, అభిజ్ఞా పనితీరుకు మంచిది. న్యూరోట్రాన్స్మిషన్ ప్రక్రియకు దోహదం చేస్తుంది. సంతానోత్పత్తికి మంచిది: మఖానా వంధ్యత్వ సమస్యలతో వ్యవహరించడంలో పురుషులు,మహిళలు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తుంది.ఇవీ చదవండి: US Air Crash: పెళ్లి కావాల్సిన పైలట్, ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదం!చిన్నపుడే పెళ్లి, ఎన్నో కష్టాలు, కట్ చేస్తే.. నిర్మలా సీతారామన్‌కు చేనేత పట్టుచీర -
లోటస్ సీడ్స్ : అస్సలు తక్కువ అంచనా వేయొద్దు!
లోటస్ లేదా తామర అనేది నెలంబో జాతికి చెందిన మొక్క. దీని గింజలను లోటస్ సీడ్స్, తామర గింజలు, మఖానా (ఫాక్స్‌నట్స్) అంటారు. సుమారు 7000 సంవత్సరాలుగా దీన్ని పూజల్లోనే ఔషధంగా కూడా ఉపయోగ పడుతోంది. ఒక విధంగా బాదం, జీడిపప్పు , ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే ఏ మాత్రం తక్కువ కాదు. ఎండ బెట్టిన తామర గింజలను మంచి పోషకాహారం, ఔషధంగా వినియోగిస్తున్నారు. ఒకటి తెల్ల, రెండు గోధుమ రంగులో ఉన్న లోటస్ విత్తనాలు భారతదేశం, జపాన్ , చైనాలలో విస్తృతంగా సాగవుతున్నాయి.లోటస్ ఫుడ్‌ను ఆహారంగా చైనా ఆమోదించింది. లోటస్ గింజలు తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలతో నిండి ఉంటాయి. తామర గింజల వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం ♦ నిద్రలేమి, జ్వరం ,హృదయ సంబంధ వ్యాధులతో సహా వివిధ వ్యాధుల చికిత్సకు సాంప్రదాయకంగా తామర గింజలను ఉపయోగిస్తారు. ♦ లోటస్ గింజలు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటిట్యూమర్ ఎఫెక్ట్‌లతో సహా వివిధ ఔషధ కార్యకలాపాలను కలిగి ఉంటాయి. ♦ విరేచనాలు ,విరేచనాలు వంటి జీర్ణశయాంతర రుగ్మతలకు చికిత్స చేయడానికి సాంప్రదాయ వైద్యంలో తామర గింజలు వాడతారు. ♦ సంతానోత్పత్తి , లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సాంప్రదాయ వైద్యంలో తామర గింజలు వాడతారు. ♦ మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను మాడ్యులేట్ చేసే యాంటీ-డిప్రెసెంట్ లక్షణాలున్నాయి. ♦ ఆయుర్వేదం ప్రకారం మధుమేహం ఇతర వ్యాధుల నుండి రక్షిస్తుంది. అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించగలదు. ♦ తేలికగా బరువు తగ్గాలనుకునే వారు లోటస్ సీడ్స్‌ను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ♦ తామర పువ్వు వేర్లలో అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ♦ విటమిన్ సి, ఐరన్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ,ఐరన్ ఫైబర్ కూడా అధిక మోతాదులో లభిస్తాయి. ♦ 100 గ్రాముల మఖానాలో, 9.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ♦ లోటస్ సీడ్స్ లేదా ఫాక్స్ నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. సో ఇది యాంటి ఏజింగ్ ఎలిమెంట్‌గా పనిచేస్తుంది. ♦ తామర గింజల్లో కెంప్ఫెరోల్ అనే సహజ సమ్మేళనం ఆర్థరైటిస్ రుమాటిజం రోగుల్లో వాపులను నివారిస్తుంది. కీళ్లనొప్పులతో బాధపడే రోగులకు ఇది మంచిది. ♦ గ్లూటెన్ రహిత పదార్తాలకు ప్రత్యామ్నాయంగా మఖానాను తినవచ్చు. -
కలువలతో మధుమేహం నియంత్రణ!
• ప్రయోగ పూర్వకంగా నిరూపించిన ఐఐసీటీ • కలువగింజలు, దుంపలతో ఆరోగ్యానికి మేలు • శాస్త్రవేత్త అశోక్ తివారీ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఈ రోజుల్లో తినేతిండితో వస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. బాగా పాలిష్ చేసిన వరి, గోధుమలు.. శుద్ధీకరణ కారణంగా వంటనూనెలు అనేక సూక్ష్మ పోషకాలను కోల్పోతున్నాయి. ఫలితంగా శరీరంలో జీవక్రియల్లో తేడాలు వచ్చి.. మధుమేహం మొదలుకుని.. కేన్సర్ వరకూ అనేక వ్యాధులకు దారితీస్తున్నట్లూ తాజా పరిశోధనలు తేల్చారుు. మరి మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవడం ఎలా? దీనికి మన తాతలు, ముత్తాతలు తిన్న ఆహారాన్ని మళ్లీ తినడం మొదలుపెడితే చాలు అంటున్నారు సీఎస్ఐ ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్త అశోక్ తివారీ. ఆయుర్వేద, యునానీ వైద్యవిధానాల్లో ప్రస్తావిం చిన కొన్ని ఆహార పదార్థాలు మందులుగా ఎలా పనిచేస్తాయన్న విషయాన్ని ఆధునిక పద్ధతుల ద్వారా ఆయన నిరూపిస్తున్నారు. నీలికలువ మొక్కల గింజలు, దుంపలు మధుమేహం, ఊబకాయ సమస్యలను సమర్థంగా ఎదుర్కోగలవని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. అధికం గా శుద్ధి చేసిన ఆహారాలను తిన్న వెంటనే రక్తంలోని చక్కెర, కొవ్వుల మోతాదు అకస్మాత్తుగా పెరిగిపోతుందని, ఇవి కాస్తా.. శరీరంలో ఫ్రీరాడికల్స్ పెరిగేందుకు, తద్వారా జీవక్రియల్లో తేడాలు వచ్చేందుకు కారణమ వుతోందని తివారీ బుధవారం మీడియాకు చెప్పారు. ఈ నేపథ్యంలో తాము ఒకప్పుడు ఆహారంగా వాడిన నీలి కలువల విత్తనాలు, దుంపలు జీవక్రియలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేశామని చెప్పారు. గింజలు, దుంపల సారాన్ని ద్రవరూపంలో సేకరించి ప్రయోగశాలలో పరిశీలించినప్పుడు అవి కార్బోహైడ్రేట్లు, కొవ్వులను విడగొట్టే ఎంజైమ్‌లపై ప్రభావం చూపుతున్నాయని, తద్వారా జీర్ణక్రియను మందగింప జేయడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని కూడా నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మధుమేహ మందు ఎకార్బోజ్, కొవ్వులు తొందరగా జీర్ణమయ్యేందుకు వాడే ఒర్లిస్టాట్ మందుల కంటే మెరుగ్గా నీలికలువ విత్తనాలు, దుంపలు పనిచేస్తున్నట్లు తమ ప్రయోగాల ద్వారా తెలిసిందని అశోక్ తివారీ తెలిపారు. అంతేకాక.. ఇవి అనేక వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను శరీరం నుంచి తొలగించేందుకు కూడా బాగా ఉపయోగపడతాయని ఆయన వివరించారు.