న్యూఢిల్లీ: టికెట్ లేకుండా రైల్వేస్టేషన్లోకి ప్రవేశించడానికే అనుమతి లేకపోగా... 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 27 లక్షల మంది టికెట్లు లేకుండా రైళ్లలో ప్రయాణిస్తూ అధికారులకు పట్టుబడ్డారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సమాచార హక్కు కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్‌టీఐ పిటిషన్‌కు సమాధానంగా రైల్వే శాఖ ఈ వివరాలు వెల్లడించింది. 2019–20తో పోలిస్తే ఇది 25 శాతం కంటే తక్కువ కావడం గమనార్హం. పట్టుబడిన 27 లక్షల మంది నుంచి రూ. 143.82 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు వెల్లడించింది. 2019–20 సంవత్సరంలో 1.10 కోట్ల మంది టికెట్లు కొనకుండా ప్రయాణిస్తూ పట్టుబడగా, వారి నుంచి రూ. 561.73 కోట్లు వసూలు చేశారు.
ఎప్పటి నుంచో ఉన్నదే..: భారత రైల్వేలో టికెట్లు కొనకుండా ప్రయాణించే సమస్య ఎప్పటి నుంచో ఉందని, రైల్వేకు అది ఓ సవాలు అని రైల్వే శాఖ అధికార ప్రతినిధి డీజే నరైన్ పేర్కొన్నారు. ప్రయా ణికులకు దానిపై హెచ్చరికలు చేస్తున్నామని, జరిమానాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలి పారు. గత సంవత్సరాలతో పోలిస్తే 2020–21 సంవత్సరంలో తక్కువ రైళ్లు తిరిగాయి, అయినప్ప టికీ భారీ స్థాయిలో టికెట్లు లేకుండా ప్రయాణించినవారు పట్టుబడ్డారు. గతేడాది ఏప్రిల్ 14 నుంచి మే 3 వరకు లాక్‌డౌన్ కారణంగా రైళ్లు తిరగలేదు. ఆ తర్వాత కూడా కొన్ని రైళ్లు మాత్రమే తిరిగాయి. టికెట్ విజయవంతంగా బుక్ అయిన వారినే రైల్వేస్టేషన్‌లోకి అనుమతించినా ఈ స్థాయిలో టికెట్ లేకుండా పట్టుబడటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment