
శబరిగిరిలో మకరజ్యోతి దర్శనం
కేరళ: శబరిమలైలో శుక్రవారం సాయంత్రం మకరజ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతిని దర్శించుకునేందుకు వచ్చిన లక్షలాది మంది అయ్యప్ప భక్తులతో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి. ఈ ఏడాది మకరజ్యోతి మూడు సార్లు దర్శినమిచ్చింది. అయ్యప్ప నామస్మరణలతో శబరిగిరులు మారుమ్రోగాయి. మకరజ్యోతి దర్శనంతో దేశవ్యాప్తంగా భక్తులు పులకించిపోయారు.