శబరిమల: వార్షిక మండలం–మకరజ్యోతి ఉత్సవాల కోసం ప్రఖ్యాతిగాంచిన శబరిమల అయ్యప్పస్వామి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. బుధవారం సాయంత్రం తంత్రి (ఆలయ ప్రధాన పూజారి) మహేశ్ మొహన్నరు గుడి తలుపులను తెరిచారు. విరీచికం (మలయాళ నెల తొలి రోజు) సందర్భంగా గురువారం ఉదయం తంత్రి అష్టద్రవ్య మహా గణపతి హోమం నిర్వహించి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆలయం తెరవడంతో దర్శనం చేసుకునేందుకు ఇప్పటికే వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చారు. 41 రోజులపాటు నిర్వహించే మండల పూజ కార్యక్రమం డిసెంబర్ 26న పూర్తికానుంది. అదే రోజు పూజ తర్వాత గుడి తలుపులు మూసి డిసెంబర్ 30న తెరుస్తారు. జనవరి 14న మకరజ్యోతి దర్శనం అయిన వారం తర్వాత ఆలయ తలుపులు మూసేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment