బుట్టాయగూడెం : పాముకాటుకు ఓ బాలిక దుర్మరణం పాలైన ఘటన బుట్టాయగూడెం మండలం ఉప్పరిల్ల గ్రామ సమీపంలోని అడ్డమెట్ట కొండరెడ్డి గ్రామంలో బుధవారం జరిగింది.
పాముకాటుకు బాలిక మృతి
Published Wed, Sep 7 2016 11:29 PM | Last Updated on Thu, Mar 28 2019 6:33 PM
బుట్టాయగూడెం : పాముకాటుకు ఓ బాలిక దుర్మరణం పాలైన ఘటన బుట్టాయగూడెం మండలం ఉప్పరిల్ల గ్రామ సమీపంలోని అడ్డమెట్ట కొండరెడ్డి గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పట్ల మంగప్రియ(8) బుధవారం ఉదయం పాముకాటుకు గురైంది. ఏదో కరిచిందని బాలిక ఏడుస్తుంటే తల్లి విజయలక్ష్మి ఆమెను పట్టించుకోలేదు. బాలికను కొట్టి బుట్టాయగూడెం వెళ్లిపోయింది. తిరిగి వచ్చి చూసేసరికి పాప నురగలు కక్కుకుని మరణించింది. ఈ ఘటన గురించి తెలుసుకుని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో వంశీలాల్ రాథోడ్ ఆ గ్రామం వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజనులు ఇంకా మూడనమ్మకాలతో కొట్టుమిట్టాడుతున్నారని, మంగప్రియను పాము కాటు వేస్తే తల్లి గమనించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. గిరిజనులకు ఆరోగ్యం, ప్రమాదాలు, ఆస్పత్రుల్లో అందిస్తున్న సేవల గురించి కళాజాతాల ద్వారా అవగాహన కల్పిస్తామని వివరించారు.
Advertisement
Advertisement