సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయో పరిమితి సమస్య వచ్చి పడింది. ఎస్సై, కానిస్టేబుల్ వంటి యూనిఫాం పోస్టులకు గరిష్ట వయోపరిమితిపై మూడేళ్ల సడలింపు ఇచ్చిన ప్రభుత్వం ఎక్సైజ్ ఎస్‌ఐ పోస్టుల విషయంలో ఇవ్వలేదు. ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి గరిష్ట వయోపరిమితి సడలింపు కోసం ప్రతిపాదనలు అందకపోవడం వల్లే ప్రభుత్వం ఇవ్వలేదని సమాచారం. ఫలితంగా ఇటీవల టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన గ్రూపు-2 పోస్టుల నోటిఫికేషన్‌లో ఎక్సైజ్ ఎస్‌ఐ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లుగానే పేర్కొంది.
దీంతో తమకు అన్యాయం జరుగుతుందని అనేక మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఎక్సైజ్ ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ఆరేళ్ల తరువాత చర్యలు చేపట్టినా సంబంధిత శాఖ వయో పరిమితి పెంపును పట్టించుకోలేదని, అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తే ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉండేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008, 2009 తరువాత ఎక్సైజ్ ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయలేదు.
ఎక్సైజ్ ఎస్‌ఐ పోస్టులకు వయోపరిమితి పెంపు లేదా?
Published Fri, Jan 8 2016 3:09 AM | Last Updated on Thu, Mar 28 2019 6:33 PM
Advertisement