మలక్‌పేట ఎక్సైజ్ పోలీసులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ శనివారం ఓ మహిళ సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
సైదాబాద్ : మలక్‌పేట ఎక్సైజ్ పోలీసులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ శనివారం ఓ మహిళ సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితులు కథనం మేరకు .. శుక్రవారం రాత్రి ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీకి చెందిన సుశీల ఇంటికి వచ్చిన మలక్‌పేట ఆబ్కారి శాఖలో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ గణేష్, కానిస్టేబుల్ ఇంట్లో సారా ప్యాకెట్లు ఉన్నట్లు తమకు సమాచారం ఉందని, తమకు సహకరిస్తే ఎలాంటి కేసులు లేకుండా చూస్తామని చెప్పారన్నారు.
దీంతో సుశీల వారిపై తిరగబడగాచుట్టు పక్కల వారు వచ్చి పోలీసులిద్దరికీ దేహశుద్ధి చేశారు. తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా విధి నిర్వాహణలో ఉన్న తమపై అకారణంగా దాడి చేశారని ఆరోపిస్తూ నిందితులు ప్రతి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సైదాబాద్ పోలీసులు విచారణ చేస్తున్నారు.