అది మంచి పరిణామం
అండర్-19 ప్రపంచకప్‌లో ఎవరైనా ఒక్కసారి మాత్రమే పాల్గొనేలా బీసీసీఐ నిబంధన విధించడం మంచి పరిణామమని భారత ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయ పడ్డారు. తప్పుడు వయో ధ్రువీకరణ పత్రాలతో ఎక్కువ కాలం అండర్-19 స్థాయిలోనే ఆడుతున్నవారిని దీని ద్వారా నిరోధించే అవకాశం ఉందని ఆయన అన్నారు. కుర్రాళ్లనుంచి ఫలితాలు ఆశించడం కంటే ఎక్కువ మందికి అవకాశం కల్పించడం ముఖ్యమని, అందు కోసం ఈ వయో విభాగంలో పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను సిద్ధంగా ఉంచాలని ద్రవిడ్ సూచించారు.