రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఏలూరు అర్బన్ : పట్టాలు దాటుతుండగా, ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
ఏలూరు అర్బన్ : పట్టాలు దాటుతుండగా, ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. భీమడోలు గ్రామానికి చెందిన దత్తి శ్రీను (55) చాలా కాలంగా భార్యాబిడ్డలకు దూరంగా ఏలూరులో ఒంటరిగా జీవిస్తున్నాడు. తాపీ పనులు చేసుకుంటూ స్థానిక పవర్‌పేట రైల్వే స్టేషన్‌లోనే కాలం వెళ్లబుచ్చుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీను గురువారం రాత్రి స్థానిక శ్రీనివాసా థియేటర్ సమీపంలో పట్టాలు దాటుతుండగా సత్రాగంజ్‌సికింద్రాబాద్ రైలు ప్రమాదవశాత్తూ ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎస్.వి. జాన్సన్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. మృతుని జేబులో లభించిన ఫోన్ బుక్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.