
'పద్నాలుగేళ్లప్పుడే నాపై లైంగిక దాడి'
తనపై పద్నాలుగేళ్ల వయసులోనే లైంగికంగా వేధింపులు జరిగాయని ప్రముఖ గాయని రీతా ఓరా తెలిపింది.
లాస్ ఎంజెల్స్: తనపై పద్నాలుగేళ్ల వయసులోనే లైంగికంగా వేధింపులు జరిగాయని ప్రముఖ గాయని రీతా ఓరా తెలిపింది. లండన్ లోని సిల్వియా యంగ్ థియేటర్ స్కూల్ లో డ్రామా స్టూడెంట్ గా విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు 26 ఏళ్ల వ్యక్తి తనపై లైంగిక పరమైన దాడి చేసి లోబర్చుకున్నాడని తెలిపింది.
అయితే, అదంతా బలవంతంగా జరిగిందని తాను చెప్పలేనని అని మరోమాట అంటూ సంచలనం రేపింది. అయితే, అలాంటి పనులు ఆ వయసులో సరైనవి కావని మాత్రం చెప్పగలనని వివరించింది. గతంలో విషయాలు పట్టించుకోవడం లేదని, ప్రస్తుతంపైనే దృష్టిని సారించి తనను తాను తెలుసుకుంటున్నానని పేర్కొంది. గతంలో జరిగిన పొరపాట్లకు తన ప్రమేయం కూడా ఉందని, ఆ వ్యక్తిని మాత్రమే నిందించలేనని వివరణ ఇచ్చింది.