సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీలో శుక్రవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం గురువారం విడుదల చేసిన పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఓయూ లైబ్రరీ నుంచి భారీ ర్యాలీగా వచ్చిన విద్యార్థులు గన్‌పార్క్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.
ప్రభుత్వం నిన్న విడుదల చేసిన కానిస్టేబుల్, ఎస్సై నియామకాల్లో గరిష్ట వయోపరిమితి ఆరు సంవత్సరాలు పెంచాలని నిరుద్యోగులు ధర్నా చేశారు. అలాగే ఇంగ్లీష్ మీడియం మెరిట్ విధానం వల్ల తెలుగు మీడియం విద్యార్థులు నష్ట పోతున్నారని.. దాన్ని వెంటనే తొలగించి వయోపరిమితి పెంచాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతా రాయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వయో పరిమితి పెంచక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెపడుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆందోళన చేపడుతున్న జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఆందోళన చేపట్టిన ఓయూ విద్యార్థులు
Published Fri, Jun 1 2018 4:48 PM | Last Updated on Thu, Mar 28 2019 6:33 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment