ఆదిలాబాద్ టౌన్/రిమ్స్ : నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ కొలువుల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ వార్తతో నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారు. ఆయా కేటగిరీలకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితికి కూడా ఐదేళ్లు సడలింపునిస్తూ పెంచడంతో వారికి ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలో యువత ఉద్యోగాలు వస్తాయన్న ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. త్వరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
జిల్లాలో నిరుద్యోగులు 65 వేలకు పైనే..
డిగ్రీలు, పీజీలు పట్టాలు పొంది ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు జిల్లాలో 66,346 మంది ఉన్నారు. కేవలం విద్యా, పోలీసు శా ఖల్లో మాత్రమే పోస్టులను భర్తీ చేస్తూ మిగతా శా ఖల్లో పోస్టులను గత ప్రభుత్వాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగు తూ వచ్చింది. ఉన్నత చదువులు చదివిన వారు సై తం చిన్నచిన్న ఉద్యోగాల కోసం పోటీ పడుతూ దరఖాస్తు చేసుకుంటున్నారు.
నాలుగేళ్లుగా అరకొరగా ఉద్యోగాలను భర్తీ చేయడంతో ఈ పరిస్థితి నెల కొం ది. ప్రతినెలా ఉద్యోగులు పదవీ విరమణ పొందుతుండడంతో ఆయా శాఖల్లో ఖాళీలు ఏర్పడుతున్నా యి. కొత్త వారిని నియమించకపోవడంతో ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకే ఇన్‌చార్జి బాధ్యత లు అప్పగిస్తున్నారు. దీంతో వారికి కూడా పనిభారం పెరిగి విధులకు న్యాయం చేయలేకపోతున్నారు.
వయోపరిమితి పెంపు వరం..
ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల అర్హతకు వయసు పరిమితి ముగియడంతో చాలా మంది నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు. ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం కోసం తప్ప.. ప్రభుత్వ కొలువు పొందే అవకాశం కోల్పోతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉద్యోగాలకు వయో పరిమితి సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో జిల్లాలో దాదాపు 10 వేల మంది ఉద్యోగాలకు అర్హత సాధించనున్నారు. దీంతో వారు పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్..
ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి ఇది వరకే ప్రకటించిన విషయం విధితమే. తాజాగా మరోసారి అసెంబ్లీలో దీనిపై స్పష్టత ఇచ్చి ఉద్యోగులకు భరోసా కల్పించారు. దీంతో జిల్లాలో సుమారు వెయ్యికి పైగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
వయోపరిమితి ఐదేళ్లు సడలింపు
Published Wed, Nov 26 2014 1:59 AM | Last Updated on Thu, Mar 28 2019 6:33 PM
Advertisement
Advertisement