
రాతియుగం నుంచి ప్లాస్టిక్ యుగానికి..
పాత రాతి యుగం.. కొత్త రాతి యుగం.. ఇలాంటి దశల నుంచి క్రమంగా మనం ప్లాస్టిక్ యుగం వైపు వెళ్లిపోతున్నామట. దీని గురించి పరిశోధకులు మానవాళిని హెచ్చరిస్తున్నారు.
పాత రాతి యుగం.. కొత్త రాతి యుగం.. ఇలాంటి దశల నుంచి క్రమంగా మనం ప్లాస్టిక్ యుగం వైపు వెళ్లిపోతున్నామట. దీని గురించి పరిశోధకులు మానవాళిని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ అంత తొందరగా నశించకపోవడం, భూమిలో కలవకపోవడం వల్ల భూగ్రహంపై తీవ్ర ప్రభావం, అది కూడా దీర్ఘ కాలం పాటు చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్వత శిఖరాల నుంచి సముద్ర అంతర్భాగాల వరకు ఎక్కడ చూసినా ప్లాస్లిక్ కనపడుతోందని, భవిష్యత్తుకు ఇది చాలా ముప్పుగా పరిణమిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్‌కు చెందిన జియాలజీ శాఖలోని పాలియోబయాలజీ ప్రొఫెసర్ జాన్ జలాసియావిజ్ హెచ్చరించారు.
ప్రతి మూడేళ్లకు వంద కోట్ల టన్నుల ప్లాస్టిక్ తయారుచేస్తున్నామని, ఇది మొత్తం భూమ్మీద ఒక పొరలా వేసేందుకు సరిపడ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ శతాబ్ది మధ్యనాటికి అలాంటి పొరలు చాలా ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. సముద్రాల్లో పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా దూరం పాటు ప్రయాణిస్తాయని, మధ్యలో ఏమాత్రం పాడవ్వవని, చివరకు ఏదో ఒక బీచ్‌లో అవి తేలుతాయని వివరించారు. వీటివల్ల జలచరాలకు కూడా తీవ్ర స్థాయిలో ముప్పు ఉంటుందన్నారు.