
మరో ఏడాది వయోపరిమితి సడలింపు
కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు వర్తింపు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థుల వయో పరిమితి మరో ఏడాది పెంచుతూ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీసు పోస్టులకు సంబంధించి ఇప్పటికే మూడేళ్లు వయో పరిమితి సడలించిన ప్రభుత్వం... తాజాగా మరో ఏడాది పెంచింది. దీంతో జనరల్ కేటగిరీలో 26 ఏళ్ల వయసున్న వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాలకు కూడా నిబంధనలను అనుసరించి ఈ వయోపరిమితి వర్తిస్తుంది.
కమ్యూనికేషన్ విభాగంలో మొత్తం 332 పోస్టులు ఉన్నాయి. ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రభుత్వం గతంలో సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులకు వయో పరిమితిని ఏడాది పెంచిన విషయం తెలిసిందే. తాజాగా కమ్యూనికేషన్ విభాగంలోని పోస్టులకూ దానిని వర్తింపజేశారు.