దేశ పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు కేవలం ఐడెంటిటీ ప్రూఫ్, చిరునామా గుర్తింపు పత్రంగా మాత్రమే కాకుండా అనేక పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తున్నాయి. ఒక బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు తీసుకోవాలన్న ఆధార్ కార్డు తప్పనిసరి.
ఆధార్ కార్డులో మమూలుగా ఎవైనా మార్పులు చేయాలంటే ఆధార్ సెంటర్లకు జనాలు పరుగులు తీస్తారు. కాగా ప్రస్తుతం ఆధార్ తెచ్చిన సదుపాయంతో పుట్టినతేదిని మార్చడం మరింత సులువుకానుంది. నేరుగా యుఐడిఎఐ వెబ్‌సైట్‌లో పుట్టినతేదీలో మార్పులు చేయవచ్చును. యుఐడిఎఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ లింక్ https://ssup.uidai.gov.in/ssup/ ద్వారా ఆన్‌లైన్‌లో మీ పుట్టినతేదీని మార్చుకోవచ్చును.
ఆధార్ కార్డులో పుట్టిన తేదీని సవరించడానికి అవసరమైన పత్రాలు:
- జనన ధృవీకరణ పత్రం
- ఎస్‌ఎస్‌ఎల్‌సి బుక్ / సర్టిఫికేట్/ ఎస్‌ఎస్‌సీ లాంగ్ మెమో
- పాస్‌పోర్ట్
- గుర్తింపుపొందిన విద్యా సంస్థ జారీ చేసిన పుట్టిన తేదీని కలిగి ఉన్న ఫోటో ఐడి కార్డ్.
- పాన్ కార్డ్
ఆధార్‌కార్డులో పుట్టినతేదీని ఇలా సవరించండి:
- ముందుగా ఈ https://ssup.uidai.gov.in/ssup/ లింకును ఓపెన్ చేయాలి.
- అందులో ఫ్రోసిడ్ టూ ఆప్‌డేట్ ఆధార్‌ను క్లిక్ చేయాలి.
- ఆప్‌డేట్ ఆధార్ ఆన్‌లైన్‌ను క్లిక్ చేసిన తరువాత 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి కాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
- తరువాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఆధార్‌తో లింక్ ఐనా ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- మొబైల్‌కు వచ్చిన 6 అంకెల వన్ టైం పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- లాగిన్ ఐనా తరువాత మీకు సంబంధించిన ఆధార్ వివరాల వెబ్ పేజ్ ప్రత్యక్షమవుతుంది. ఈ వెబ్ పేజీలో మీకు పుట్టిన రోజు మార్పు చేసే ఆప్షన్ కనిపిస్తుంది.
- పుట్టిన రోజు మార్పు చేసే ఆప్షన్ క్లిక్ చేసిన తరువాత వెబ్‌పేజీలో పుట్టినరోజుకు సంబంధించిన స్కాన్‌డ్ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేసి సబ్మిట్ బటన్‌ను నొక్కండి.
- విజయవంతంగా వేరిఫికేషన్ జరిగిన తరువాత మీ మొబైల్ ఫోన్‌కు కన్ఫర్మెషన్ వస్తుంది.
కాగా ఆధార్‌కార్డులో పుట్టినతేదీని మార్చినందుకుగాను రూ.50 సర్వీస్ ఛార్జ్‌ను వసూలు చేస్తుంది. ఇలా చేయాలంటే ఆధార్ కార్డుకు కచ్చితంగా మొబైల్ ఫోన్ నంబర్ రిజస్ట్రేషన్ తప్పనిసరి.
#AadhaarOnlineServices
— Aadhaar (@UIDAI) June 16, 2021
Update your DoB online through the following link - https://t.co/II1O6Pnk60, upload the scanned copy of your original document and apply. To see the list of supportive documents, click https://t.co/BeqUA0pkqL #UpdateDoBOnline #UpdateOnline pic.twitter.com/QPumjl6iFr
Comments
Please login to add a commentAdd a comment