ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు గడువును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరోసారి పొడిగించింది. ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 14ను చివరి తేదీగా యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఆధార్ కార్డ్ ఫ్రీ అప్‌డేట్ మై ఆధార్ పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునేందుకు రూ .50 రుసుము వసూలు చేస్తారు. ఆన్‌లైన్ పోర్టల్లో యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ గడువును పొడిగించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఈ తేదీని 2023 డిసెంబర్ 15గా నిర్ణయించారు. తరువాత మార్చి 14, ఆ తరువాత జూన్ 14 తాజాగా సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.
ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ చేసుకోండిలా..
» స్టెప్ 1: మీ 16 అంకెల ఆధార్ నంబర్‌ను ఉపయోగించి https://myaadhaar.uidai.gov.in/ కి లాగిన్ అవ్వండి
» స్టెప్ 2: క్యాప్చా ఎంటర్ చేసి 'లాగిన్ యూజింగ్ ఓటీపీ'పై క్లిక్ చేయండి.
» స్టెప్ 3: మీ లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.
» స్టెప్ 4: మీరు ఇప్పుడు పోర్టల్‌ను యాక్సెస్ చేయగలరు.
» స్టెప్ 5: 'డాక్యుమెంట్ అప్డేట్' ఎంచుకోండి. రెసిడెంట్ ప్రస్తుత వివరాలు కనిపిస్తాయి.
» స్టెప్ 6: మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్లను అంటే పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను ఎంచుకోండి
» స్టెప్ 7: ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ లేదా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్‌ను ఎంచుకోండి. అవసరమైన డాక్యుమెంటును అప్‌లోడ్ చేయండి.
» స్టెప్ 8: 'సబ్‌మిట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
» స్టెప్ 9: 14 అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (యూఆర్ఎన్) జనరేట్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment