ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు దసరా పండుగకు తీపి కబురు అందించారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు దసరా పండుగకు తీపి కబురు అందించారు. నిరుద్యోగుల వయో పరిమితి పెంచుతూ ఏపీ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు సడలింపు ఇచ్చింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో వయోపతిమితికి దగ్గరగా ఉన్న లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు మళ్లీ చిగురించినట్లే. రాష్ట్రంలో నిరుద్యోగులకు వివిధ ఉద్యోగ పరీక్షలకు వయోపరిమితి పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.