రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
Published Wed, Oct 26 2016 11:05 PM | Last Updated on Thu, Mar 28 2019 6:33 PM
భట్లమగుటూరు (పెనుమంట్ర) : పెనుమంట్ర మండలం భట్లమగుటూరు గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మార్టేరు నుంచి పెనుమంట్ర వైపు వెళ్తున్న ఆటోలో ఆచంటకు చెందిన పలువురు మహిళలు వెళ్తున్నారు. భట్లమగుటూరు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న మినీలారీ ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటోలో ఉన్న ఆచంటకు చెందిన కె.సీత, ఎం.చిట్టి సుందరమ్మ(55)కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిట్టిసుందరమ్మæ మృతి చెందింది. ఇదే ప్రమాదంలో మరో నలుగురు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆటో దెబ్బతింది. మినీలారీ డ్రైవర్ కునికిపాట్లు పడడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పెనుమంట్ర ఎస్‌ఐ జి.జె.ప్రసాద్ తెలిపారు.
Advertisement
Advertisement