కామారెడ్డి: గతంలో పిల్లల పెళ్లి విషయంలో తల్లిదండ్రులే నిర్ణయం తీసుకునేవారు. వారు నిర్ణయించిన సమయంలో వివాహం జరిగేది. అయితే మారిన పరిస్థితుల్లో యువతలో చాలా మార్పులు వచ్చాయి. ఎలాంటి సంపాదన లేకుండా వివాహం చేసుకోవడం ద్వారా కుటుంబా న్ని పోషించలేమని, ఇదే సమయంలో కన్నవారికి భారం కాకూడదన్న భావనతో చాలా మంది పెళ్లికి తొందరపడ డం లేదు. ఎంతో కొంత సంపాదించినపుడే సొంత జీవితాన్ని మొదలుపెట్టాలని భావిస్తున్నారు.
గతంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. బాల్య వివాహాలను నివారించేందుకుగాను ప్రభుత్వాలు వివాహ వయస్సును పురుషులకు21సంవత్సరాలు, స్త్రీలకు 18సంవత్సరాలుగా నిర్ణయించాయి. నిరక్షరాస్యత ఉన్న కుటుంబాల్లో ఇప్పటికీ కొన్నిచోట్ల బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే చదువుకున్న కుటుం బాల్లో మాత్రం చాలా వరకు బాల్యవివాహాలు జరుగడం లేదు. పిల్లల పె ళ్లిళ్లతో బాధ్యతలు తీర్చుకుందామని తల్లిదండ్రులు భావిస్తున్నా, తాము జీవితంలో స్థిరపడనిదే వివాహం చే సుకోమంటూ పిల్లలు స్పష్టం చేస్తున్నా రు. దీంతో చాలా మంది 25 యేళ్లు దాటిన తరువాతనే వివాహం చేసుకుంటున్నారు.
ఉద్యోగం తరువాతే..
చదువుకున్న యువకులు ఉద్యోగం వచ్చిన తరువాతనే వివాహం చేసుకోవాలనే భావన పెంచుకున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందడానికి బీఈడీ, డీఈడీ చదివిన వారు డీఎస్సీల కోసం ఎదురు చూస్తున్నారు. డీఎస్సీలో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని, తరువాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఎన్ని సంబంధాలు వచ్చినా ఉద్యోగం తరువాతనే సిగ్నల్స్ పంపుతున్నారు. దీంతో తల్లిదండ్రులు పిల్లల మాటను కాదనలేకపోతున్నారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నా సరే స్థిరపడ్డ తరువాతనే వివాహం అంటుండడంతో పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయి. చదువును మధ్యలో వదిలేసి, వివిధ వృత్తులు, వ్యాపారాలవైపు చూస్తున్నవారు సైతం స్థిరపడ్డ తరువాతనే పెళ్లంటున్నారు. పట్టణ ప్రాంతాల్లోనైతే ఇటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
అమ్మాయిలైతే..
చదువుకున్న అమ్మాయిలైతే ఉద్యోగాలు వచ్చినా కొంతకాలం ఆగుతామనే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. తమ చదువులకు లక్షలు ఖర్చు చేసిన తల్లిదండ్రులు, పెళ్లి కట్నాలు, ఇతర ఖర్చులకు కూడా అప్పులు చేస్తున్నారని, ఉద్యోగం రాగానే వివాహం చేసుకుంటే కన్నవారికి ఏమీ చేయలేమన్న భావన వారిలో ఉంది. కూతురి వివాహం చేసి తమ బాధ్యత తీర్చుకుందామనే తల్లిదండ్రులకు, కొంతకాలం తరువాత చేసుకుంటామంటూ వారిని సముదాయిస్తున్నారు. తమ ఉద్యోగ వేతనం తల్లిదండ్రులు ఎంతో కొంత అనుభవించాలని కూతుళ్లు కోరుకుంటున్నారు.
పెళ్లికి తొందరెందుకంటున్న యువత
Published Sat, Nov 15 2014 4:40 AM | Last Updated on Thu, Mar 28 2019 6:33 PM
Advertisement