కానిస్టేబుల్‌ అభ్యర్థుల వయో పరిమితి పెంచాలి | Constable candidates Increasing the age limit | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ అభ్యర్థుల వయో పరిమితి పెంచాలి

Published Sat, Aug 13 2016 11:48 PM | Last Updated on Thu, Mar 28 2019 6:33 PM

Constable candidates Increasing the age limit

ఉప ముఖ్యమంత్రికి విన్నవించిన వైఎస్సార్‌ఎస్‌యూ
అనంతపురం ఎడ్యుకేషన్‌ : కానిస్టేబుల్‌ అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని కలిసి శనివారం వినతిపత్రం అందించారు. నాయకులు మాట్లాడుతూ వయో పరిమితి 22 ఏళ్లకు కుదించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు నష్టపోతారన్నారు. తెలంగాణలో 25 ఏళ్ల వరకు సడలింపు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని చెప్పి,అధికారంలోకి వచ్చి 26 నెలలు గడిచినా ఏ ఒక్కరికీ ఉద్యోగ అవకాశం కల్పించలేదన్నారు. అన్ని శాఖల్లోనూ దాదాపు లక్షన్నర పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌. సలాంబాబు, ప్రధాన కార్యదర్శి జీవీ లింగారెడ్డి, కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, ప్రధానకార్యదర్శులు బాబాసలాం, రాఘవేంద్రరెడ్డి, సుధీర్‌రెడ్డి, చంద్రశేఖర్,  ఎస్కేయూ నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, క్రాంతికిరణ్, శ్రీనివాసరెడ్డి, మోహన్, గోకుల్‌ తదితరులు ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement