Malaika Arora Road Accident: Actress Finally Share Her Car Accident Details Inside - Sakshi
Sakshi News home page

Malaika Arora Car Accident: 'ఇప్పటికీ నమ్మబుద్ది కావట్లేదు.. అలా జరిగిపోయింది'

Published Sun, Apr 10 2022 10:26 AM | Last Updated on Sun, Apr 10 2022 11:38 AM

Malaika Arora Finally Opens Up On Her Car Accident Says Thanks To Everyone - Sakshi

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ మలైకా అరోరా ఇటీవలె రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ముంబై – పూణే ఎక్స్ ప్రెస్ హైవే మీద పన్వేల్ సమీపంలో ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. ఇదిలా ఉండగా యాక్సిడెంట్‌ తర్వాత తొలిసారి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించింది. 'నాకు యాక్సిడెంట్‌ అయిన సంఘటన ఇప్పటికీ నమ్మశక్యంగా అనిపించడం లేదు.

ఏదో సినిమాలో జరిగినట్లు జరిగిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో నాతో పాటు ఉన్నవారు, చుట్టుపక్కల వారు ఎంతో సహాయం చేశారు. నన్ను వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడి వైద్య సిబ్బంది సహకారంతో నేను కోలుకుంటున్నాను. స్నేహితులు, బంధువులు, అభిమానులు తనపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు.

వారు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను' అంటూ పోస్ట్‌ చేసింది. కాగా మోడల్‌గా కెరీర్‌ని ఆరంభించిన మలైకా స్పెషల్‌ సాంగ్స్‌తో పాపులర్‌ అయ్యింది. తెలుగులోనూ మహేశ్‌బాబు ‘అతిథి’, పవన్‌ కల్యాణ్‌ ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌తో అలరించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement