![Shraddha Kapoor Enjoys Auto Ride In Mumbai Wacth Video - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/26/Shraddha-Kapoor.jpg.webp?itok=w94-dhGo)
Shraddha Kapoor Auto Ride In Mumbai: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఆటోలో ప్రయాణించింది. ఖరీదైన కారు ఉన్నా సాధారణ అమ్మాయిలా ఆటోలోనే ప్రయాణం చేసింది. దీనికి సంబంధించి ఆటో జర్నీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. దీనికి లవ్ సింబర్‌ను జోడించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సెలబ్రిటీ అయ్యుండి కూడా సింపుల్‌గా ఆటోలో ప్రయాణించడంపై సాహో బ్యూటీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
శ్రద్ధా సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. నేను కూడా అదే ఆటోలో ఉంటే బాగుండేది అంటూ ఓ అభిమాని వీడియోను రీట్వీట్ చేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శ్రద్ధా చల్‌బాజ్ ఇన్ లండన్‌లో నటిస్తుంది. దీనితో పాటు నాగిన్ సీరియల్ ఆధారంగా తెరకెక్కుతున్న ఓ సినిమాకు సైన్ చేసింది. ఈ సినిమాకు నిఖిల్ ద్వివేది నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment