auto ride
-
రూపాయికే ఆటో రైడ్: భారీగా ఎగబడిన జనం
బెంగళూరులో ప్రయాణమంటే కొంత కఠినతరమే.. చార్జీలు (ఆటో) కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ తరుణంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఓ బంపరాఫర్ ప్రకటించింది. కేవలం ఒక రూపాయికే ఆటోరైడ్ అంటూ ఓ వీడియోను కంపెనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఫ్లిప్‌కార్ట్ ప్రకటన చూసిన చాలామంది రూపాయి మాత్రమే చెల్లించి నగరాన్ని చుట్టేస్తున్నారు. దీంతో నగరంలో ఆటోల రద్దీ బాగా పెరిగిపోయింది. ఆటోలను బుక్ చేసుకోవడానికి చాలా మంది ఎగబడుతున్నారు. యూపీఐ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఫ్లిప్‌కార్ట్ స్థానిక ఆటో డ్రైవర్లతో కలిసి టెక్ క్యాపిటల్‌లో ఈ ప్రచారాన్ని ప్రారంభించింది.ఇదీ చదవండి: రెండు రోజుల్లో 33 కోట్లు: పండుగ సీజన్లో ఫ్లిప్‌కార్ట్ జోరుఫ్లిప్కార్ట్ ప్రకటించిన ఈ ఆఫర్ కేవలం బెంగళూరు నగర వాసులకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మరింత ఉత్సాహాన్ని నింపడానికి సంస్థ రూపాయికే ఆటోరైడ్ ప్రకటించింది. కేవలం రూపాయికే ప్రయాణం చాలా గొప్ప విషయం అంటూ.. చాలామంది నెటిజన్లు ఫ్లిప్‌కార్ట్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని దేశంలోని ఇతర నగరాలకు కూడా విస్తరించాలని మరికొందరు నెటిజన్లు కోరుతున్నారు. -
‘ఉబర్’ రైడ్‌కు కోట్లలో బిల్లు..! షాక్ అయిన కస్టమర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో దీపక్ తెంగురియా అనే వ్యక్తి రొటీన్‌గా తాను వెళ్లే రూట్లో ఉబర్ ఆటో రైడ్ బుక్ చేశాడు. రైడ్ తక్కువ దూరమే అయినందున రూ.62 బిల్లు చూపించింది. మామూలే కదా అని ఆటో ఎక్కి డెస్టినేషన్‌లో దిగి బిల్లు పే చేద్దామనుకునే సరికి దీపక్ అవాక్కయ్యాడు. ఏకంగా రూ.7.66 కోట్లు పే చేయాలని బిల్లు చూపించింది. దీంతో ఆశ్చర్యపోవడం దీపక్ వంతైంది. దీపక్‌కు ఇంత భారీ బిల్లు రావడానికి సంబంధించిన వీడియోను ఆయన స్నేహితుడు ఆశిష్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశాడు. దీనిపై వీడియోలో స్నేహితులిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చంద్రయాన్‌కు రైడ్ బుక్ చేసుకున్నా ఇంత బిల్లు రాదని ఇద్దరు స్నేహితులు జోకులు వేసుకున్నారు. सुबह-सुबह @Uber_India ने @TenguriyaDeepak को इतना अमीर बना दिया कि Uber की फ्रैंचाइजी लेने की सोच रहा है अगला. मस्त बात है कि अभी ट्रिप कैंसल भी नहीं हुई है. 62 रुपये में ऑटो बुक करके तुरंत बनें करोडपति कर्ज़दार. pic.twitter.com/UgbHVcg60t — Ashish Mishra (@ktakshish) March 29, 2024 అయితే అతి తక్కువ దూరం ఆటో రైడ్‌కు కోట్లలో బిల్లు రావడంపై ఉబర్ స్పందించింది. ‘భారీ బిల్లు ఇచ్చి ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు. మాకు కొంత సమయమిస్తే దీనిపై అప్డేట్ ఇస్తాం’అని ఉబర్ సందేశం పంపింది. ఇదీ చదవండి.. వీల్ చైర్లో వచ్చాడు.. విల్ పవర్ చూపాడు -
క్యాబ్ లేదా ఆటో రైడ్ బుకింగ్ చేస్తున్నారా? చేతిలో నగదు లేదా?
సాక్షి, సిటీబ్యూరో: క్యాబ్ లేదా ఆటో రైడ్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్నారా....జేబులో డబ్బులు ఉంటేనే క్యాబ్ బుక్ చేసుకోండి. లేకుండా కష్టమే. చార్జీలు ఆన్లైన్లో చెల్లించవచ్చుననుకుంటే మీరు బుక్ చేసుకున్న క్యాబ్ మరో క్షణంలోనే రద్దయిపోవచ్చు. ఇది నిజమే. నగరంలో ఓలా, ఉబెర్, తదితర క్యాబ్ సంస్థలకు అనుసంధానమై తిరుగుతున్న క్యాబ్‌లు, ఆటోలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆన్లైన్, యూపీఐ చెల్లింపులకు నిరాకరిస్తున్నాయి. రైడ్ బుక్ చేసుకున్న మరుక్షణంలోనే డ్రైవర్లు ఫోన్ చేసి అడుగుతున్నారు. చార్జీలు నగదు రూపంలో చెల్లిస్తేనే వస్తామంటూ పేచీ పెడుతున్నారు. ఆన్లైన్లో చెల్లిస్తామంటే వెంటనే రైడ్ రద్దు చేస్తున్నారు. దీంతో మరో క్యాబ్ కోసం, ఆటో కోసం తిరిగి మొబైల్ యాప్‌ను ఆశ్రయించాల్సి వస్తుంది. అలా గంటల తరబడి బుకింగ్‌ల కోసమే నిరీక్షించవలసి వస్తుందని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఏదో ఒకటి పట్టుకొని వెళ్లాలనుకొంటే కష్టమే. తీరా గమ్యం చేరుకున్న తరువాత చార్జీల చెల్లించేటప్పుడు బాగా ఇబ్బంది పెడుతున్నారు.’అని సీతాఫల్‌మండికి చెందిన సురేష్ చెప్పారు. సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీ వరకు క్యాబ్ బుక్ చేసుకొనేందుకు గంటకు పైగా ఎదురుచూడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. చినుకు పడితే బండి కష్టమే... ఒకవైపు ఆన్లైన్ చెల్లింపులపైనా రైడ్‌కు డ్రైవర్లు నిరాకరిస్తుండగా ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు క్యాబ్ సంస్థలు సైతం ఉన్నపళంగా చార్జీలను పెంచేస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నా, ఏ కొంచెం వర్షం కురిసినా చాలు క్యాబ్ లభించడం కష్టంగా మారుతుంది. రద్దీ వేళల నెపంతో చార్జీలను రెట్టింపు చేస్తున్నారు. సాధారణంగా గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్ వరకు రూ.250 నుంచి రూ.300 వరకు చార్జీ ఉంటే వర్షాన్ని సాకుగా చేసుకొని కొన్ని సంస్థలు రూ.550 నుంచి రూ.750వరకు పెంచేస్తున్నాయి. మార్కెట్లో డిమాండ్‌ను పెంచుకొనేందుకు కొన్ని క్యాబ్ సంస్థలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని రెగ్యులర్ ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లోనూ ఇష్టారాజ్యంగా చార్జీలు పెంచేస్తున్నారు. దీంతోపాటు సర్ చార్జీల రూపంలోనూ ప్రయాణకులపైన అదనపు వడ్డింపులకు పాల్పడడం గమనార్హం. ‘ప్రతికూలమైన వాతావరణం వల్ల త్వరగా ఇల్లు చేరాలంటే డిమాండ్ మేరకు చెల్లించక తప్పడం లేదు.’ అని అమీర్‌పేట్‌కు చెందిన నవీన్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి చెప్పారు. క్యాబ్ సంస్థల జాప్యం.. మరోవైపు నగదు చెల్లింపుల పైన డ్రైవర్ల వాదన మరో విధంగా ఉంది. క్యాబ్ సంస్థల ఖాతాలో పడే చార్జీలు తిరిగి తమ ఖాతాలోకి చేరేందుకు పడిగాపులు కాయవలసి వస్తుందని పేర్కొంటున్నారు. డ్రైవర్లు ప్రతి రోజు చేసే రైడ్‌లపైన క్యాబ్ సంస్థలు 30 శాతం వరకు కమిషన్ తీసుకొని మిగతా 70 శాతం వారి ఖాతాలో జమ చేయాలి. కానీ డ్రైవర్‌కు చెల్లించవలసిన డబ్బులు రెండు, మూడు రోజుల తరువాత మాత్రమే ఖాతాలో జమ అవుతున్నాయి. దీంతో తమ రోజువారీ అవసరాలకు కష్టమవుతుందని అంబర్‌పేట్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ వెంకటేశ్ తెలిపారు. ఏ రోజుకు ఆ రోజు ఖాతాలో జమ చేయకపోవడం వల్లనే ఈ ఇబ్బంది వస్తున్నట్లు చెప్పారు. -
ముంబై వీధుల్లో ఆటో నడిపిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్
Rahul Sipligunj Rides Auto On Streets In Mumbai Video Viral: బిగ్‌బాస్ సీజన్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ముంబై వీధుల్లో ఆటో నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది తన జీవితంలో లంబోర్ఘిని అని, దీని వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానంటూ రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇక ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలె ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ ముంబై వెళ్లాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎంతగానో పాపులర్ అయిన నాటు నాటు సాంగ్‌ని రాహుల్ పాడిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది జనవరి7న ఈ సినిమా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో కొమురమ్ భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ పాత్రలు పోషించారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ క్యూటీ ఆలియాభట్, తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) -
ఆనంద్ మహీంద్రా గారూ.. మీ ఆటో సూపరే! కానీ..
వ్యాపారాల్లో పోటీతత్వం ఉంటుందని(ఉండాల్సిందే!), వ్యాపారుల మధ్య వైరం మాత్రమే ఉంటుందని అనుకోవడం సహజం. కానీ, ఈరోజుల్లో మార్కెట్‌ను పెంచుకోవాలన్నా, ప్రొడక్టులను ప్రమోట్ చేసుకోవాలన్నా ‘ఫ్రెండ్లీ నేచర్’ కచ్చితంగా ఉండాలని నిరూపిస్తున్నారు మన వ్యాపార దిగ్గజాలు. ఇందుకు సోషల్ మీడియానే వేదికగా మార్చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సాప్ట్వేర్ ఐటీ కంపెనీ ‘జోహో కార్పొరేషన్’ సీఈవో శ్రీధర్ వెంబు, వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్లు చేశారు. శ్రీధర్ వెంబు(53).. జోహో కార్పొరేషన్ సీఈవో. తంజావూరు(తమిళనాడు)లో పుట్టిన శ్రీధర్.. జోహోతో పేరు ప్రఖ్యాతులు, పద్మశ్రీ అవార్డు సైతం సంపాదించుకున్నారు. అయితే 2019లో టెంకాశీ పరిధిలోని మాతాలంపరై అనే కుగ్రామంలో సెటిల్ అయ్యారు. అప్పటి నుంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ పోస్ట్‌లన్నింటిని ఆయన ట్విటర్లో షేర్ చేస్తున్నారు. ఈ మధ్య ఆయన మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేయడమే కాదు.. దానిని ఆయనే స్వయంగా ఆ పల్లెటూరిలో నడిపాడట. ఇంకేం ఆ అనుభవాన్ని ఇంటర్నెట్లో పంచుకోవడమే కాదు.. కంపెనీ యాజమాని ఆనంద్ మహీంద్రాకు కొన్ని ఫ్రెండ్లీ సలహాలు కూడా ఇచ్చారు శ్రీధర్. 1/ Yesterday I got my new@MahindraElctrc Treo electric auto. This one is a serious upgrade - capable of 55 km/hour speed and a range of 125 km on a full charge. That makes it a practical commute vehicle and I love driving it around! I have some suggestions @anandmahindra pic.twitter.com/XyWBLJyv8l — Sridhar Vembu (@svembu) December 6, 2021 ‘‘ఫుల్‌ఛార్జీతో 125కి.మీ. రేంజ్, గంటకు 55 కి.మీ.వేగంతో దూసుకుపోయే ఆటో ఇది. దీనిని నడపడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. పల్లెటూరి రోడ్లకు సైతం తగ్గట్లుగా సౌకర్య వంతంగా ఉంది. పైగా సరసమైన ధరలో.. కుటుంబంతో సహా బయటకు వెళ్లడానికి ఎంతో అనుగుణంగా ఉంది ఇది. ఊళ్లో తిరుగుతున్న టైంలో చాలామంది ఇది ఎక్కడ దొరుకుతుందని అడిగారు. అందుకే ఆనంద్ మహీంద్రగారికి కొన్ని సలహాలు ఇవ్వదల్చుకున్నా... 3/ @anandmahindra Please offer a variety of designs and colors on the electric auto line. Offer family and kid friendly options. Come up with a cool marketing campaign to popularize these low-cost electric vehicles. I see great potential for them. I love driving one! 🙏 — Sridhar Vembu (@svembu) December 6, 2021 ఆనంద్ మహీంద్రా గారూ.. Mahindra treoలోనే వెరైటీ డిజైన్లను, కలర్స్‌ను తీసుకు రండి. పిల్లలు, కుటుంబాలకు తగ్గట్లు చిన్న మార్పులు చేయండి. మంచి మార్కెటింగ్‌తో ఈ లోకాస్ట్ ఈవీను ప్రచారం చేస్తే.. కచ్చితంగా వర్కవుట్ అవుతుంది. ఇదే మీకిచ్చే సలహా’ అంటూ ఈ ఉదయం(సోమవారం) ట్వీట్ల ద్వారా సలహాలు ఇచ్చారు శ్రీధర్. అంతేకాదు ఈ ఆటోపై అభ్యంతరాలు వ్యక్తం చేసినవాళ్లకు సమాధానం ఇవ్వడంతో పాటు పలువురి అనుమానాల్ని సైతం ఓపికగా నివృత్తి చేశారాయన. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా, శ్రీధర్ వెంబు ట్వీట్లపై స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ ఈవీ ఆటోరిక్షా పూర్తి స్వదేశీ ఉత్పత్తి. ధర 3.5 లక్షల లోపే ఉంది. ఫీచర్లపై ప్రతికూల రివ్యూలు ఉన్నా.. గతుకు రోడ్లు, ఎత్తుపల్లాలపై దూసుకుపోయే కెపాసిటీ ఉందన్న రివ్యూలు దక్కించుకుంది. కిందటి ఏడాది భారత్‌లో ఐదు వేల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది ఏకైక ఈ-ఆటో కూడా ఇదే!. చదవండి: ఇది మరో ప్యాండెమిక్.. వ్యాక్సిన్ కూడా లేదు-ఆనంద్ మహీంద్రా -
డబుల్ ‘ధమాకా’ : సికింద్రాబాద్ నుంచి బంజారాహిల్స్‌కు ఏకంగా రూ.1,050
సాక్షి, హైదరాబాద్: క్యాబ్‌లు, ఆటోలు ఠారెత్తించాయి.. చార్జీల మోత మోగించాయి.. ఒకవైపు సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. మరోవైపు భారత్ బంద్ నేపథ్యంలో నెలకొన్న ప్రభావంతో నగరంలో ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడ్డారు. ఆటోలు, సెవెన్‌సీటర్ ఆటోలు రెట్టింపు చార్జీలను వసూలు చేయగా, క్యాబ్‌లలో సర్ చార్జీలు, పీక్ అవర్స్ నెపంతో అమాంతంగా పెంచారు. సాధారణ రోజుల్లో ఉండే చార్జీలకంటే రెట్టింపు చెల్లించాల్సి వచి్చందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, తదితర రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించిన ప్రయాణికులు, ఆసుపత్రులు వంటి అత్యవసర పనులపై బయటకు వెళ్లిన వాళ్లు నిలువుదోపిడీకి గురయ్యారు. చదవండి: మణికొండలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహం లభ్యం ఇదేం సర్‌చార్జీ.. సాధారణ రోజుల్లో సికింద్రాబాద్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10 వరకు క్యాబ్ చార్జీ రూ.300 నుంచి రూ.350 వరకు ఉంటుంది. కానీ సోమవారం ఇది ఏకంగా రూ.1,050 వరకు చేరింది. సెడాన్లలో రూ.1,250 వరకు చార్జీలు వసూలు చేశారు. సర్‌చార్జీలతో ప్రయాణికులపై క్యాబ్ సంస్థలు అదనపు బాదుడుకు పాల్పడ్డాయి. ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకొనే సమయానికి క్యాబ్‌లు అందుబాటులో లేవనే అంశాన్ని సాకుగా చూపుతూ సమీప ప్రాంతాల్లో ఉన్న క్యాబ్‌లను ఏర్పాటు చేసే ఉద్దేశంతో 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల వరకు సర్ చార్జీల రూపంలో అదనపు చార్జీలు విధిస్తున్నారు. చదవండి: ఎల్బీ నగర్: యువతిపై కానిస్టేబుల్ లైంగికదాడి ► సాధారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే కనిపించే రద్దీని వర్షం దృష్ట్యా అన్ని వేళల్లో రద్దీ ఉన్నట్లు చూపుతూ పీక్ అవర్స్(రద్దీ గంటలు)లో అదనపు చార్జీలను విధించారు. దీంతో ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ వరకు రూ.200 వరకు ఉండే చార్జీలు సోమవారం సాయంత్రం ఏకంగా రూ.500 దాటినట్లు వెంకటేశ్ అనే ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వర్షం: ఏటా ఇదే సీన్.. అయినా! ► నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉన్న చార్జీలు సాయత్రం అమాంతంగా పెరిగాయి. మరోవైపు క్యాబ్ సంస్థలు విధించే సర్‌చార్జీలు, పీక్‌అవర్స్ చార్జీల్లో తమకు ఏ మాత్రం లభించడం లేదని, కేవలం ఆయా సంస్థల ఖాతాల్లోనే జమ అవుతుందని డ్రైవర్లు వాపోతున్నారు. పెరిగిన క్యాబ్‌ల వినియోగం.. ► కోవిడ్ దృష్ట్యా తీవ్రంగా నష్టపోయిన క్యాబ్‌లు ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్నాయి. మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో వేలాది మంది క్యాబ్ డ్రైవర్లు వాహనాలను వదులుకొని ప్రత్యామ్నాయ ఉపాధిని చూసుకోవాల్సి వచ్చింది. కానీ లాక్డౌన్ అనంతరం కోవిడ్ కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో రెండు నెలలుగా క్యాబ్‌ల వినియోగం పెరిగింది. ► ప్రతిరోజూ 40 వేలకు పైగా క్యాబ్‌లు తిరుగుతున్నట్లు అంచనా. ఐటీ, పర్యాటక రంగాలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించడంతో పాటు అంతర్జాతీయ రాకపోకలు తిరిగి మొదలైతే మరో 20 వేలకు పైగా క్యాబ్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇలా ఉండగా కోవిడ్ నష్టాన్ని పూడ్చుకునేందుకే క్యాబ్ సంస్థలు దోపిడీకిపాల్పడుతున్నాయని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఆటో ఇష్టారాజ్యం.. చాలాకాలంగా మీటర్లను వినియోగించకుండానే నడుపుతున్న ఆటోవాలాలు ప్రయాణికుల నుంచి ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. సోమవారం బంద్ వార్తలతో పాటు వర్షం కూడా తోడవడంతో బాహాటంగానే తమ దోపిడీ పర్వాన్ని సాగించారు. జూబ్లీబస్‌స్టేషన్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు ఏకంగా రూ.280 తీసుకున్నట్లు ఒక ప్రయాణికుడు ఆందోళన వ్యక్తం చేశాడు. వర్షం కారణంగా త్వరగా ఇళ్లకు చేరుకోవాలని ఆటోలను ఆశ్రయించిన వారికి ఆటోవాలాలు పట్టపగలే చుక్కలు చూపించారు. -
ఖరీదైన కారును వదిలి ఆటోలో ప్రయాణించిన హీరోయిన్
Shraddha Kapoor Auto Ride In Mumbai: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఆటోలో ప్రయాణించింది. ఖరీదైన కారు ఉన్నా సాధారణ అమ్మాయిలా ఆటోలోనే ప్రయాణం చేసింది. దీనికి సంబంధించి ఆటో జర్నీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. దీనికి లవ్ సింబర్‌ను జోడించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సెలబ్రిటీ అయ్యుండి కూడా సింపుల్‌గా ఆటోలో ప్రయాణించడంపై సాహో బ్యూటీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రద్ధా సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. నేను కూడా అదే ఆటోలో ఉంటే బాగుండేది అంటూ ఓ అభిమాని వీడియోను రీట్వీట్ చేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శ్రద్ధా చల్బాజ్ ఇన్ లండన్‌లో నటిస్తుంది. దీనితో పాటు నాగిన్ సీరియల్ ఆధారంగా తెరకెక్కుతున్న ఓ సినిమాకు సైన్ చేసింది. ఈ సినిమాకు నిఖిల్ ద్వివేది నిర్మించనున్నారు. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరో.. వీడియో వైరల్
‘‘మా హీరో అంతే.. చాలా సింపుల్’’ అంటూ అజిత్ అభిమానులు అభినందిస్తున్నారు. ఇలా అభినందించడానికి కారణం అజిత్ చేసిన ఆటో ప్రయాణమే. ఇటీవల చెన్నైలో ఆటోలో వెళుతూ కనిపించారు అజిత్. ముఖానికి మాస్క్ ఉన్నప్పటికీ అది కచ్చితంగా అజితే అని అర్థమైపోతుంది. ఆయన్ను గుర్తుపట్టి అభిమానులు వీడియో తీశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. ‘‘అంత పెద్ద స్టార్ హీరో ఇలా ఆటో ప్రయాణం చేయడం ఆయన సింప్లిసిటీకి నిదర్శనం. నిరాడంబరతకు చిరునామా ఆయన’’ అంటున్నారు అభిమానులు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘వలిమై’ అనే చిత్రంలో నటిస్తున్నారు అజిత్. ఈ సినిమా ఫస్ట్ లుక్ అజిత్ బర్త్ డే సందర్భంగా మే 1న రిలీజ్ కానుంది. -
లాక్డౌన్: ముంబై నుంచి బిహార్‌కు ఆటోలో
పట్నా: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న వలస కూలీలు సొంత ఊళ్లకు పయనమయ్యారు. కానీ రవాణా వ్యవస్థ స్తంభించటంతో కాలి నడకన వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. అవకాశం ఉన్న చోట ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో బిహార్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు ముంబైకి 621 కిలోమీటర్ల దూరాన మధుబనిలో ఉన్న తమ గ్రామానికి ఆటోలో పయనమయ్యారు. దాదాపు రెండు నెలల పాటు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూసిన వారు చివరకు.. ఓ ఆటో మాట్లాడుకుని ఊరికి ప్రయాణం అయ్యారు.(లాక్డౌన్: ‘అది ఫేక్‌న్యూస్’) దీనిపై సదరు యువుకులు మాట్లాడుతూ.. ‘నితీష్ కుమార్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని భావించాం. రెండు నెలల నుంచి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూశాం. కానీ మా బాధను ఎవరు పట్టించుకోలేదు. విధిలేని పరిస్థితుల్లో ఓ ఆటో మాట్లాడుకుని బయలుదేరాం’ అన్నారు. అయితే ప్రతి పక్షాలు ఈ విషయంలో నితీష్ ప్రభుత్వం మీద విమర్శలు కురిపిస్తున్నారు. తక్షణమే వలస కార్మీకులను ఆదుకోవాలని.. లేదంటే వారు ఈ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.(ఇంటి ముంగిటే వైద్యం) నిన్న, మహారాష్ట్ర నుంచి ఉత్తర ప్రదేశ్, బిహార్ వైపు వెళ్తున్న వేలాది మంది వలస కారర్మికులు జాతీయ రహదారి 3లో ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. రవాణా సదుపాయాలు కల్పించకపోవడమే కాక కనీసం ఆహారం కూడా అందజేయకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వలస కార్మీకులు ఆందోళన చేశారు. అధికారుల మీద రాళ్లు రువ్వారు. -
పిల్లలతో కలసి ఆటోలో హీరో షికారు
ముంబై: సరదాగా షికారుకు వెళ్లాలంటే ఏ ఖరీదైన స్పోర్ట్స్ బైకులోనో లేదా లగ్జరీ కారులోనో వెళ్లొచ్చు. అందులోనూ క్రేజ్ ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో. అయితే హృతిక్ రోషన్ మాత్రం తన కొడుకులు హ్రేహాన్, హృదాన్‌లతో కలసి ఆటోలో షికారుకు వెళ్లాడు. తన పిల్లలతో కలసి ఆటోలో ముంబై వీధుల్లో తిరుగుతూ హృతిక్ తెగ ఎంజాయ్ చేశాడు. కార్లు తప్ప ఆటో ఎక్కని హృతిక్ కొడుకులకూ ఈ ప్రయాణం కొత్తగా అనిపించింది. హృతిక్ తన కొడుకులతో ఆటోలో ప్రయాణిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాము ముగ్గురం బాగా ఎంజాయ్ చేశామని, తక్కువ పాకెట్ మనీతో ఆటో ప్రయాణం తన పిల్లలకు కొత్త అనుభవమని హృతిక్ ట్వీట్ చేశాడు.