బెంగళూరులో ప్రయాణమంటే కొంత కఠినతరమే.. చార్జీలు (ఆటో) కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ తరుణంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఓ బంపరాఫర్ ప్రకటించింది. కేవలం ఒక రూపాయికే ఆటోరైడ్ అంటూ ఓ వీడియోను కంపెనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఫ్లిప్‌కార్ట్ ప్రకటన చూసిన చాలామంది రూపాయి మాత్రమే చెల్లించి నగరాన్ని చుట్టేస్తున్నారు. దీంతో నగరంలో ఆటోల రద్దీ బాగా పెరిగిపోయింది. ఆటోలను బుక్ చేసుకోవడానికి చాలా మంది ఎగబడుతున్నారు. యూపీఐ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఫ్లిప్‌కార్ట్ స్థానిక ఆటో డ్రైవర్‌లతో కలిసి టెక్ క్యాపిటల్‌లో ఈ ప్రచారాన్ని ప్రారంభించింది.
ఇదీ చదవండి: రెండు రోజుల్లో 33 కోట్లు: పండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ జోరు
ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన ఈ ఆఫర్ కేవలం బెంగళూరు నగర వాసులకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో మరింత ఉత్సాహాన్ని నింపడానికి సంస్థ రూపాయికే ఆటోరైడ్ ప్రకటించింది. కేవలం రూపాయికే ప్రయాణం చాలా గొప్ప విషయం అంటూ.. చాలామంది నెటిజన్లు ఫ్లిప్‌కార్ట్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని దేశంలోని ఇతర నగరాలకు కూడా విస్తరించాలని మరికొందరు నెటిజన్లు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment