పట్నా: లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న వలస కూలీలు సొంత ఊళ్లకు పయనమయ్యారు. కానీ రవాణా వ్యవస్థ స్తంభించటంతో కాలి నడకన వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. అవకాశం ఉన్న చోట ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో బిహార్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు ముంబైకి 621 కిలోమీటర్ల దూరాన మధుబనిలో ఉన్న తమ గ్రామానికి ఆటోలో పయనమయ్యారు. దాదాపు రెండు నెలల పాటు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూసిన వారు చివరకు.. ఓ ఆటో మాట్లాడుకుని ఊరికి ప్రయాణం అయ్యారు.(లాక్‌డౌన్: ‘అది ఫేక్‌న్యూస్’)
దీనిపై సదరు యువుకులు మాట్లాడుతూ.. ‘నితీష్ కుమార్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని భావించాం. రెండు నెలల నుంచి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూశాం. కానీ మా బాధను ఎవరు పట్టించుకోలేదు. విధిలేని పరిస్థితుల్లో ఓ ఆటో మాట్లాడుకుని బయలుదేరాం’ అన్నారు. అయితే ప్రతి పక్షాలు ఈ విషయంలో నితీష్ ప్రభుత్వం మీద విమర్శలు కురిపిస్తున్నారు. తక్షణమే వలస కార్మీకులను ఆదుకోవాలని.. లేదంటే వారు ఈ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.(ఇంటి ముంగిటే వైద్యం)
నిన్న, మహారాష్ట్ర నుంచి ఉత్తర ప్రదేశ్, బిహార్ వైపు వెళ్తున్న వేలాది మంది వలస కారర్మికులు జాతీయ రహదారి 3లో ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. రవాణా సదుపాయాలు కల్పించకపోవడమే కాక కనీసం ఆహారం కూడా అందజేయకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వలస కార్మీకులు ఆందోళన చేశారు. అధికారుల మీద రాళ్లు రువ్వారు.
Comments
Please login to add a commentAdd a comment