
‘‘మా హీరో అంతే.. చాలా సింపుల్’’ అంటూ అజిత్ అభిమానులు అభినందిస్తున్నారు. ఇలా అభినందించడానికి కారణం అజిత్ చేసిన ఆటో ప్రయాణమే. ఇటీవల చెన్నైలో ఆటోలో వెళుతూ కనిపించారు అజిత్. ముఖానికి మాస్క్ ఉన్నప్పటికీ అది కచ్చితంగా అజితే అని అర్థమైపోతుంది. ఆయన్ను గుర్తుపట్టి అభిమానులు వీడియో తీశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.
‘‘అంత పెద్ద స్టార్ హీరో ఇలా ఆటో ప్రయాణం చేయడం ఆయన సింప్లిసిటీకి నిదర్శనం. నిరాడంబరతకు చిరునామా ఆయన’’ అంటున్నారు అభిమానులు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘వలిమై’ అనే చిత్రంలో నటిస్తున్నారు అజిత్. ఈ సినిమా ఫస్ట్ లుక్ అజిత్ బర్త్ డే సందర్భంగా మే 1న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment