హీరో అజిత్ (ఫైల్)
సాక్షి, చెన్నై: తమిళ స్టార్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెన్నైలోని ఆయన నివాసం ఇజంబక్కంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పూర్తి తనిఖీకి ఇంకా రెండు గంటల సమయం పెట్టె అవకాశం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇవాళ జూలై(18)న అజిత్ ఇంటిలో బాంబు పెట్టినట్లు అజ్ఞాతవ్యక్తి కంట్రోల్ రూంకు ఫోన్ చేసి వెంటనే పెట్టేసినట్లు పోలీసులు తెలిపారు. హుటాహుటిన బాంబు స్వాడ్‌తో అజిత్ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం తనిఖీ కొనసాగుతోంది. ఫోన్‌కాల్‌పై ప్రత్యేక దృష్టిపెట్టి కారణాలను త్వరలోనే తెలుసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. (చదవండి: హీరో అజిత్‌కు ఏమైంది?)
ఈ ఫోన్ కాల్ తమిళనాడులోని విల్లుపురం జిల్లా నుంచి వచ్చిందని, త్వరలో కచ్చితమైన లోకేషన్‌ను గుర్తించి అజ్ఞాతవ్యక్తిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇటీవల హీరో విజయ్, రజనీకాంత్‌ల ఇంటికి కూడా బాంబు బెదరింపు కాల్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ కూడా విల్లుపురం జిల్లా నుంచి వచ్చింది. అయితే ఆ కాల్‌ను భువనేశ్వర్ అనే వ్యక్తి చేసినట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లగా అతడు మతిస్థిమితం లేనివాడని, అంగవైకల్యంతో బాధపడుతున్నాడంటూ అతడి కుటుంబ సభ్యులు పోలీసులను క్షమాపణలు కోరారు. ప్రస్తుతం అజిత్ హెచ్ వినోత్ వాలిమై దర్శకత్వంలో బోణికపూర్ నిర్మిస్తున్న నటిస్తున్నట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. (చదవండి: విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు)
Comments
Please login to add a commentAdd a comment