అజిత్‌తో ఉన్నది ఎవరో తెలుసా? | Ajiths Photo With His Parents Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

అజిత్‌తో ఉన్నది ఎవరో తెలుసా?

Published Thu, Nov 12 2020 10:05 AM | Last Updated on Thu, Nov 12 2020 12:44 PM

Ajiths Photo With His Parents Went Viral On Social Media - Sakshi

చెన్నై: నటుడు అజిత్‌ జాతీయస్థాయిలో పేరున్న సెలబ్రిటీ అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో బోనికపూర్‌ నిర్మిస్తున్న వలిమై చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ విషయాన్ని అటుంచితే అజిత్‌ కుటుంబం అంటే భార్య శాలిని, పిల్లలు గురించే అందరికీ తెలుసు. కానీ అజిత్‌ తల్లిదండ్రులు ఎవరికీ తెలియదు. కారణం వారు అజిత్‌ సినీలోకానికి దూరంగా ఉండడమే.

అలాంటిది ఇన్నాళ్లకు అజిత్‌ తన తల్లిదండ్రులతో ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడం విశేషం. అవును అజిత్‌ తండ్రి పేరు సుబ్రమణియం, తల్లి మోహిని. అజిత్‌ తన తల్లిదండ్రులతో కలిసి ఇటీవల ఒక దేవాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. ఆ ఫొటోనే ఇప్పుడు అజిత్‌ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారు.  (షార్ట్‌‌ అండ్‌ స్వీట్‌.. ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement