అజిత్‌కి జోడీగా... | Simran and Meena to play prominent roles in Ajith Good Bad Ugly | Sakshi
Sakshi News home page

అజిత్‌కి జోడీగా...

Published Tue, Apr 30 2024 12:04 AM | Last Updated on Tue, Apr 30 2024 12:04 AM

Simran and Meena to play prominent roles in Ajith Good Bad Ugly

కోలీవుడ్‌లో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా నిలిచిన వార్తల్లో అజిత్‌ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సిమ్రాన్, మీనా పేర్లు వినిపిస్తున్నాయి.

ఈ ఇద్దరూ అతిథి పాత్రల్లో కాదు.. అజిత్‌ సరసన హీరోయిన్లుగా నటిస్తారని టాక్‌. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’లో అజిత్‌ మూడు పాత్రల్లో కనిపిస్తారట. మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, శ్రీలీల, సిమ్రాన్, మీనాతో అజిత్‌  జతకడతారని చెన్నై కోడంబాక్కమ్‌ అంటోంది. ఈ వార్త నిజమైతే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సిమ్రాన్, మీనా అజిత్‌తో మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నట్లు అవుతుంది. ‘అవళ్‌ వరువాళా (1998), వాలి’ (1999) వంటి విజయవంతమైన చిత్రాల్లో అజిత్‌ సరసన నటించారు సిమ్రాన్‌.

అలాగే అజిత్‌కి జోడీగా ‘సిటిజెన్‌ (2001), విలన్‌’ (2002) వంటి చిత్రాల్లో నటించారు మీనా. ఇప్పుడు మళ్లీ ఈ హీరో సరసన సిమ్రాన్, మీనా నటిస్తే దాదాపు రెండు దశాబ్దాలకు ఈ కాంబినేషన్‌ కుదిరినట్లు అవుతుంది. మేలో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. సో... అజిత్‌ సరసన శ్రీలీల, సిమ్రాన్, మీనా  నటించనున్నారా? అనేది త్వరలో తెలిసి΄ోతుంది. 

మహేశ్‌బాబు సినిమాలో...
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు సిమ్రాన్‌ని ఎంపిక చేశారని సమాచారం. గతంలో ‘యువరాజు’ (2000) చిత్రంలో మహేశ్‌బాబు–సిమ్రాన్‌ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరూ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అయితే హీరో–హీరోయిన్‌గా కాదని, సిమ్రాన్‌ది అతిథి పాత్ర అని భోగట్టా. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను రాజమౌళి ప్రకటించనున్నారట. మరి.. సిమ్రాన్‌ ఈప్రాజెక్ట్‌లో ఉన్నారా? లేదా అనే ప్రశ్నకు అప్పుడు సమాధానం దొరుకుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement