
అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న 61వ చిత్ర షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఇంతకు ముందు ఈయన కథానాయకుడిగా నేర్కొండ పార్వై, వలిమై వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించిన బోనీ కపూర్, జి.స్టూడియోస్ సంస్థ మళ్లీ కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. గత చిత్రాల దర్శకుడు హెచ్.వినోద్‌నే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా అజిత్ ఇందులో కాలేజీ ప్రొఫసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇందులో ఆయనకు జంటగా నటి రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు తెలిసింది.
బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ చాలా గ్యాప్ తరువాత ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో రీ ఎంట్రీ కానుందన్న మాట. మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్ భామ టబును ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈమె అజిత్ సరసన చాలా కాలం క్రితం కండుకొండేన్ చిత్రంలో నటించారు. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈయన ఇప్పటికే ఈ చిత్రం కోసం రెండు పాటలను రికార్డ్ చేశారట. ఈ చిత్ర ప్రారంభోత్సవ దృశ్యాలను నిర్మాత బోనీకపూర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment