Malaika Arora Accident: Actress Malaika Arora Injured In Car Accident - Sakshi
Sakshi News home page

Malaika Arora: బాలీవుడ్‌ భామ మలైకాకు రోడ్డు ప్రమాదం.. ఆస్పత్రికి తరలింపు

Published Sun, Apr 3 2022 8:55 AM | Last Updated on Sun, Apr 3 2022 9:40 AM

Actress Malaika Arora Injured In Car Accident - Sakshi

Malaika Arora Car Accident: బాలీవుడ్‌ హీరోయిన్‌ మలైకా అరోరా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శనివారం ఆమె ఓ ఫ్యాషన్‌లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో ముంబైలోని ఖలాపూర్ టోల్ ప్లాజా వద్ద ఈ ప్రమాదం జరిగింది.  ఆ సమయంలో ఆమెతో పాటు  డ్రైవర్, ఓ బాడీ గార్డ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఖలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో రెండు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొట్టుకుంటూ వచ్చి మలైకా ప్రమాణిస్తోన్న కారుని బలంగా తాకాయని పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదంలో మలైకా కారు ముందుభాగం డ్యామేజ్‌ అయింది. స్వల్ప గాయాలతో బయటపడ్డ మలైకాను హుటాహుటిన నేవీ ముంబైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ముందు జాగ్రత్తలో భాగంగా ఆమెను రాత్రి అబ్జర్వేషన్‌లో ఉంచామని, నేడు మరోసారి పరీక్షలు నిర్వహించి, అన్ని బాగానే ఉంటే డిశ్చార్జ్‌ చేస్తామని వెల్లడించారు. మలైకా ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని మలైకా అరోరా సోదరి, నటి అమృతా అరోరా పేర్కొంది. 

మోడల్‌గా కెరీర్‌ని ఆరంభించిన మలైకా.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే హీరోయిన్‌గా అంతగా గుర్తింపు రాలేదు కానీ స్పెషల్‌ సాంగ్స్‌తో మాత్రం చాలా ఫేమస్‌ అయింది. ‘ఛయ్యఛయ్య’ , ‘మున్నీ బద్నామ్‌’ వంటి స్పెషల్‌ సాంగ్స్‌ మలైకాకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. తెలుగులోనూ మహేశ్‌బాబు ‘అతిథి’, పవన్‌ కల్యాణ్‌ ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌తో అలరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement