Dwayne Johnson
-
7 డాలర్లే ఉన్నాయి.. ఏకంగా ఇంటినే ఇచ్చేశాడు! దయలోనూ కింగే!
డ్వేన్ డగ్లస్ జాన్సన్ అంటే గుర్తుపట్టకపోవచ్చేమో గానీ.. ‘ది రాక్’ అనగానే చాలా మందికి అతడి రూపం కళ్ల ముందు కదలాడుతుంది. ప్రొఫెషనల్ రెజ్లర్‌గా.. హాలీవుడ్ స్టార్‌గా అతడు సాధించిన.. సాధిస్తున్న విజయాలు స్ఫురణకు వస్తాయి. ఏకంగా ఎనిమిదిసార్లు వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ చాంపియన్‌గా నిలిచిన ఘనత డ్వేన్ జాన్సన్ సొంతం. హాలీవుడ్‌లోనూ తన నటనతో స్టార్‌గా తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడతడు! కఠిన సవాళ్లను దాటుకుని కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో మే 2, 1972లో జన్మించాడు డ్వేన్ జాన్సన్. అతడి తల్లిండ్రులు అటా జాన్సన్, రాకీ జాన్సన్. రాకీ ప్రొఫెషన్ రెజ్లర్. తండ్రిని చూసి చిన్ననాటి నుంచే రెజ్లింగ్‌పై ఇష్టం పెంచుకున్నాడు డ్వేన్. డబ్ల్యుడబ్ల్యుఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించిన తండ్రి, తాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తానూ రెజ్లర్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు. అయితే, తండ్రి సంపాదనలో నిలకడ లేకపోవడంతో చిన్నతనం నుంచే ఆర్థికంగా కష్టాలు చవిచూశాడు. అద్దె కట్టలేని కారణంగా ఎన్నోసార్లు ఇళ్లు మారాల్సి వచ్చేది. This man @TheAnswerMMA is a very special human being. Themba is committed to three things: His family, his village and people in Africa, and becoming world champion in the @ufc. What an inspiration he is. Rooting for him all the way. ❤️ https://t.co/ZOOfOZLka4 — Dwayne Johnson (@TheRock) February 28, 2024 ఫలితంగా అప్పటికి రెజ్లర్‌గా మారాలన్న కలకు విరామం ఇచ్చాడు. స్కూళ్లో చదువుతున్న సమయంలో ఫుట్‌బాల్ కోచ్ డ్వేన్లో దాగిన ప్రతిభను గుర్తించి అవకాశమిచ్చాడు. క్రమక్రమంగా స్టార్ ఫుట్‌బాలర్‌గా పేరొంది పెద్ద క్లబ్బులకు ఆడే అవకాశాలు వచ్చినా గాయాల కారణంగా చేజారిపోయేవి. దీంతో మళ్లీ కథ మొదటికే వచ్చేది. అలాంటి సమయంలో అనూహ్యంగా ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో అడుగుపెట్టాడు డ్వేన్ జాన్సన్. ఆరంభంలో తండ్రి, తాత పేరు కలిసి వచ్చేలా రాకీ మైవియా పేరుతో బరిలోకి దిగాడు. ఈ క్రమంలో కఠిన సవాళ్లు ఎదుర్కొని తనకంటూ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుని ‘ది రాక్’గా ఎదిగాడు. డబ్ల్యుడబ్ల్యుఈ సూపర్‌స్టార్‌గా క్రేజ్ సంపాదించాడు. అంతటితో సంతృప్తి చెందక హాలీవుడ్లో నటుడిగా అదృష్టం పరీక్షించుకుని అక్కడా విజయవంతమయ్యాడు డ్వేన్ జాన్సన్. రెజ్లింగ్‌లోనే కాదు.. దయచూపడంలోనూ రాజే! ఇతరులకు సాయం చేయడంలోనూ తాను ముందే ఉంటానని నిరూపించాడు డ్వేన్ జాన్సెన్. అమెరికన్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌ను ప్రోత్సహించే అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్‌లో రాణించాలనుకుంటున్న ఆఫ్రికన్ వ్యక్తికి అందమైన ఇంటిని బహుమతిగా ఇచ్చాడు. తన అకౌంట్లో కేవలం ఏడు డాలర్లే ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన అతడిని సర్ప్రైజ్ చేశాడు. ‘‘ఇతడు ఎంతో ప్రత్యేకమైన మనిషి. తెంబా జీవితంలో మూడు అత్యంత ముఖ్యమైనవి. తన కుటుంబం, సౌతాఫ్రికాలోని తన గ్రామం, అక్కడి ప్రజలు.. ఇంకా యూఎఫ్‌సీలో వరల్డ్ చాంపియన్ కావడం. ఎంతో మందికి తను స్ఫూర్తి’’ అంటూ సదరు వ్యక్తిని ప్రశంసించిన డ్వేన్ జాన్సెన్.. అతడికి ఇంటి తాళాలు అందించిన వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. తెంబా అంకితభావానికి ఫిదా అయి మియామిలో ఫుల్ ఫర్నిష్డ్ ఇంటిని కానుకగా అందించాడు. ఈ నేపథ్యంలో డ్వేన్ జాన్సన్ పెద్ద మనసు పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి. The Rock gifted a UFC fighter a house after he tweeted he had $7 in his bank account pic.twitter.com/osT5Ve0GXC — Historic Vids (@historyinmemes) February 27, 2024 -
అల్లరే అల్లరి!.. కూతుళ్ల చేతికి చిక్కిన ‘ది రాక్’ డ్వేన్ జాన్సన్
-
తల్లికి రోడ్డు ప్రమాదం.. డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం ఎమోషనల్
డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం, హాలీవుడ్ స్టార్.. ది రాక్(డ్వేన్ జాన్సన్) తల్లి ఆటా జాన్సన్ కారు ప్రమాదానికి గురవ్వడం ఆందోళన కలిగించింది. విషయంలోకి వెళితే.. రాక్ తల్లి ఆటా జాన్సన్ ప్రయాణిస్తున్న కారు శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు ముందు బాగం బాగా దెబ్బతిన్నప్పటికి సకాలంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆటా జాన్సన్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎమర్జన్సీ బృందం ఆమెను ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని.. ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న రాక్(డ్వేన్ జాన్సన్) తల్లిని చూసేందుకు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చారు. ఆమె క్షేమంగా ఉందని తెలుసుకొని సంతోషించిన రాక్ ఇన్‌స్టాగ్రామ్‌లో తల్లికి జరిగిన ప్రమాదంపై ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. ''దేవుని దయ వల్ల నా తల్లి బాగానే ఉంది. సకాలంలో స్పందించిన ఎమర్జెన్సీ సర్వీస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. యాక్సిడెంట్లో కారు ముందు భాగంలో డ్యామేజ్ ఎక్కువగా జరగడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయేమోనని ఆందోళన పడ్డాను. సకాలంలో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో నా తల్లికి ప్రాణాపాయం తప్పింది. నా తల్లి(అటా జాన్సన్)తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆమె జీవితంలో చాలా కష్టాలు అనుభవించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి బయటపడిన ఆమె.. తర్వాత నాన్నతో కష్టాలు పడింది. ఒక సందర్భంలో సూసైడ్ వరకు వెళ్లింది. కానీ నాపై ప్రేమతో అవన్నీ చేయలేకపోయింది. నా తల్లి ఒక యోధురాలు.. జీవితంలో కష్టాలన్ని చూసి కూడా ఇవాళ నిబ్బరంగా ఉంది. ఇవాళ జరిగిన పెద్ద యాక్సిడెంట్లో ఆమె ప్రాణాలతో బయటపడింది. థాంక్యూ గాడ్.. నా తల్లిని కాపాడినందుకు'' అంటూ పేర్కొన్నాడు. డబ్ల్యూడబ్ల్యూఈలో దిగ్గజంగా పేరు పొందిన రాక్ పీపుల్స్ స్టార్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రెజ్లింగ్‌లో ఎనిమిదిసార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆ తర్వాత రాక్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం రాక్(డ్వేన్ జాన్సన్) హాలీవుడ్ సూపర్స్టార్లలో ఒకడిగా వెలుగొందుతున్నాడు. డబ్ల్యూడబ్ల్యూఈకి దూరంగా ఉంటున్న రాక్.. ఈసారి జరగబోయే రెసల్మేనియా(Wrestlemania)aలో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. View this post on Instagram A post shared by Dwayne Johnson (@therock) -
భారత్-పాక్ మ్యాచ్‌పై స్పందించిన డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం
చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. గతేడాది టి20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. టి20 ప్రపంచకప్ ఆరంభమైనప్పటికి ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరుతోనే వరల్డ్‌కప్ పీక్‌స్టేజీకి చేరుకోనుందడంలో సందేహం లేదు. తాజాగా హాలీవుడ్ సూపర్‌స్టార్(డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ 'ది రాక్') డ్వేన్ జాన్సన్ టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ డీసీ సూపర్ హీరో ప్రస్తుతం తన సినిమా బ్లాక్ ఆడమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ తన సినిమా ప్రమోషన్ కోసం స్టార్ స్పోర్ట్స్ చానెల్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే స్టార్‌స్పోర్ట్స్ యాజమాన్యం టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్‌పై డ్వేన్ జాసన్ చేసిన వ్యాఖ్యలను వీడియో రూపంలో విడుదల చేసింది. ప్రస్తుతం రాక్ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ''ఇద్దరు గొప్ప ప్రత్యర్థులు తలపడుతున్నారంటే ప్రపంచం మొత్తం ఆ ఇద్దరినే చూస్తుంది. టీమిండియా, పాకిస్తాన్ మధ్య జరిగేది ఒక మ్యాచ్ కాదు.. అంతకుమించి. ఇట్స్ టైమ్ ఫర్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. డోంట్ మిస్'' అంటూ డ్వేన్ జాసన్(ది రాక్) పేర్కొన్నాడు). ఇక ఐసీసీ మేజర్ టోర్నీల్లో(వన్డే వరల్డ్‌కప్, టి20 ప్రపంచకప్) పాకిస్తాన్‌పై టీమిండియాకు మంచి రికార్డు ఉంది. వన్డే ప్రపంచకప్‌లో ఇరుజట్లు తలపడిన ఏడుసార్లు టీమిండియాదే విజయం. ఇక టి20 ప్రపంచకప్‌లోనూ ఆరుసార్లు తలపడితే టీమిండియా నాలుగుసార్లు, పాక్ ఒక్కసారి మాత్రమే నెగ్గింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో మాత్రం టీమిండియా పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. .@TheRock is #ReadyForT20WC and will kickstart the #GreatestRivalry in style on 23rd Oct, 7 AM onwards on #CricketLive#IndvPak | #BelieveInBlue | ICC Men’s #T20WorldCup | #Blackadam pic.twitter.com/KawbyLbNGM — Star Sports (@StarSportsIndia) October 18, 2022 చదవండి: 'భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తాం' 'ఎంపిక చేయలేదన్న కోపమా.. కసిని చూపించాడు' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒక్క సినిమాకే వెయ్యి కోట్ల పారితోషికం!
సినిమాలో ఎవరి పారితోషికం ఎక్కువ అంటే హీరోలదే అన్న సమాధానం వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే! అయితే రానురానూ షూటింగ్ బడ్జెట్ కంటే కూడా కథానాయకుల పారితోషికానికి పెట్టే బడ్జెటే ఎక్కువవుతూ వస్తోంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు రూ.40, 50, 100 కోట్ల వరకు తీసుకుంటున్నారు. అయితే హాలీవుడ్ హీరోలు మాత్రం ఓస్, వందేనా.. మేము వెయ్యి కోట్లు తీసుకుంటున్నాం. అయినా ఇది మాకు చాలా మామూలు విషయమని తేలికగా తీసిపారేస్తున్నారట. హాలీవుడ్లో ఏ హీరో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడనేదానిపై తాజాగా ఓ సర్వే లెక్కలు బయటకు వచ్చాయి. ఇందులో టామ్ క్రూయిజ్ దాదాపు రూ.800 కోట్ల(100 మిలియన్ డాలర్స్) చొప్పున తీసుకుంటున్నాడట! టాప్ గన్: మావెరిక్ సినిమాకు ఇంత మొత్తాన్నే వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు నిర్మాత కూడా టామ్ క్రూయిజే కావడంతో బోనస్‌గా అతడికి మరో రూ.180 కోట్ల దాకా వచ్చాయట. అంటే మొత్తంగా ఒక్క సినిమాకే ఈ స్టార్ హీరో దాదాపు వెయ్యి కోట్ల మేర వెనకేశాడన్నమాట. ఇక ఆస్కార్ అవార్డుల ఫంక్షన్లో హోస్ట్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించి సెన్సేషన్ అయిన విల్ స్మిత్ ఎమాన్సిపేషన్ మూవీకిగానూ రూ.280 కోట్లు (35 మిలియన్ డాలర్స్) అందుకున్నాడట. లినార్డో డికాప్రియో, బ్రాడ్ పిట్ ఇద్దరూ తాము నటిస్తున్న సినిమాకు రూ.240 కోట్లు(30 మిలియన్ డాలర్స్) అందుకున్నారట. డ్వేన్ జాన్సన్ రూ.180 కోట్లు (22.5 మిలియన్ డాలర్స్), క్రిస్ హేమ్స్‌వర్త్, డెంజెల్ వాషింగ్టన్, విన్ డీజిల్, జాక్విన్ ఫోనిక్స్, టామ్ హార్డీ, విల్ ఫెరల్, ర్యాన్ రెనాల్డ్స్ తలా రూ.160 కోట్లు (20 మిలియన్ డాలర్స్) వెనకేసుకుంటున్నారట. చదవండి: ప్రాణం కాపాడినవాన్నే అణచివేస్తే.. 'పరంపర 2' సిరీస్ రివ్యూ వేదం బ్యూటీ ఇలా అయిపోయిందేంటి? -
జేమ్స్ బాండ్‌గా చేయాలనుందన్న ఆ స్టార్ హీరో
Dwayne Johnson Wants To Play James Bond Character: హాలీవుడ్ ఐకానిక్ స్పై థ్రిల్లర్ 'జేమ్స్ బాండ్' సినిమా ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అభిమానులైతే చిన్న చిన్న స్పైలు చేస్తూ తాము జేమ్స్ బాండ్ల ఫీల్ అవుతుంటారు. ఆ పాత్రలో నటించేందుకు యాక్టర్స్ సైతం బాండ్ అనే బ్రాండ్ కోసం ఎంతో ఆరాటపడుతారు. అలాంటి జాబితాలో 'సూపర్ మ్యాన్'గా పాపులర్ అయిన 'కావిల్ హెన్రీ'తోపాటు హాలీవుడ్ హీరోలు ఎంతోమంది ఉన్నారు. ఈ జాబితాలో తాజాగా చేరారు 'డ్వేన్ జాన్సన్ (ది రాక్)'. ఇటీవల ఈ స్టార్ నటించిన రెడ్ నోటీస్ సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న డ్వేన్ ఓ ఇంటర్య్వూలో తన మనసులోని కోరికను బయటపెట్టాడు. రీసెంట్గా వచ్చిన జేమ్స్ బాండ్ చిత్రం 'నో టైమ్ టూ డై'లో హీరోగా చేసిన డేనియల్ క్రేగ్‌కి బాండ్‌గా చివరి సినిమా. కాగా జేమ్స్ బాండ్ పాత్రలో తర్వాత ఎవరినీ తీసుకోవాలనే చర్చ నడుస్తోంది. '1967లో వచ్చిన 007 సినిమా యూ ఓన్లీ లివ్ ట్వైస్లో మా తాత పీటర్ మైవియా విలన్‌గా నటించారు. అవును, 'సీన్ కానరీ' బాండ్‌గా చేసిన సినిమాలో మా తాత విలన్. నేను ఆ 'సీన్ కానరీ'లా కూల్ బాండ్‌గా నటించాలనుకుంటున్నాను. నాకు విలన్ అవ్వాలని లేదు. నేను బాండ్ అవ్వాలి' అని 'ఎస్కైవర్ వీడియో సిరీస్ అయిన ఎక్స్‌ప్లేన్ దిస్ షో'లో జాన్సన్ తెలిపాడు. అయితే ఇంతకుముందు ఏ ఒక్క అమెరికన్ బాండ్ పాత్ర పోషించకపోగా, అమెరికన్లందరూ బాండ్ ఫ్రాంచైజీలో విలన్లుగా కనిపించారు. అందుకే జాన్సన్‌కు విలన్‌గా చేయాలని లేనట్లు తెలుస్తోంది. డేనియల్ క్రేగ్‌కు బాండ్‌గా ఐదో చిత్రమైన 'నో టైమ్ టూ డై' అక్టోబర్ మొదటి వారంలో విడుదలై యూఎస్ బాక్సాఫీస్ వద్ద 56 మిలియన్ల అమెరికన్ డాలర్లు కొల్లగొట్టింది. తదుపరి బాండ్ చిత్రం ఎప్పుడూ అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే డేనియల్‌కి ప్రత్యామ్నాయంగా తర్వాతి బాండ్ ఎవరూ అనేది ప్రకటించలేదు. ఈ జేమ్స్ బాండ్ పాత్ర ఎంపికపై 2022 వరకు చర్చించలేమని దర్శకనిర్మాతలు తెలిపారు. మరోవైపు జాన్సన్ 'బ్లాక్ ఆడమ్' సినిమాతో డీసీ ఫ్రాంచైజీలోకి అడుగుపెడుతున్నాడు. అలాగే ఇటీవల విడుదలైన డిస్నీ వెంచర్ 'జంగిల్ క్రూజ్'కు సీక్వెల్ కూడా రానుంది. -
'రెడ్ నోటీస్' హాలీవుడ్ మూవీ రివ్యూ
టైటిల్: రెడ్ నోటీస్ నటీనటులు: డ్వేన్ జాన్సన్, ర్యాన్ రెనాల్డ్స్, గాల్ గాడోట్, రితు ఆర్య కథ, దర్శకత్వం: రాసన్ మార్షల్ థర్బర్ సంగీత దర్శకుడు: స్టీవ్ జాబ్లోన్స్కీ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ దొంగతనం నేపథ్యంలో వచ్చే సినిమాలంటే ఇష్టపడనివారు ఉండరు. స్టైలిష్‌గా దొంగతనం చేయడం, పోలీసుల చేజింగ్‌లు ఆసక్తికరంగా ఉంటాయి. బాలీవుడ్లో వచ్చిన 'ధూమ్' సిరీస్ నుంచి రీసెంట్గా హాలీవుడ్ వెబ్ సిరీస్ 'మనీ హీస్ట్' వరకు ఆసక్తికరంగా ఉండేది ఈ అంశాలే. ఈ కథాంశంగా ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం 'రెడ్ నోటీస్'. ది రాక్ డ్వేన్ జాన్సన్, డెడ్‌పూల్ ర్యాన్ రెనాల్డ్స్, వండర్ వుమెన్ గాల్ గాడోట్ వంటి హాలీవుడ్ స్టార్లతో రూపొందిందీ చిత్రం. 160 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మరి ఎంతవరకు సక్సెస్ అయిందో చూద్దామా..! కథ: ఈజిప్ట్ రాణి అయిన క్లియోపాత్ర వివాహానికి తన తండ్రి పెళ్లి బహుమతిగా 3 ఎగ్స్‌ని ఇస్తాడు. కొంత కాలం తర్వాత ఆ 3 ఎగ్స్ మూడు వివిధ ప్రాంతాల్లో ఉంటాయి. ఆ ఎగ్స్‌ను కొట్టేయడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ట్స్ (కళాఖండాలు) దొంగలుగా పేరొందిన బిషప్ (గాల్ గాడోట్), నోలన్ బూత్ (ర్యాన్ రెనాల్డ్) ఏ విధంగా కష్టపడ్డారు. ఎలా ఒకరిపై ఒకరు ఎత్తుగడలు వేశారు. వారికి ఎవరెవరూ సహాయం చేశారు. ఈ దొంగతనాన్ని ఎఫ్‌బీఐ ప్రత్యేక ఏజెంట్ జాన్ హార్ట్లీ (డ్వేన్ జాన్సన్) ఎలా అడ్డుకున్నాడు? వారితో ఎందుకు చేతులు కలిపి పని చేయాల్సి వచ్చింది ? అనేదే 'రెడ్ నోటీస్' కథ. విశ్లేషణ: ప్రపంచంలోనే రెండవ అత్యుత్తమ ఆర్ట్స్ దొంగ అయిన నోలన్ బూత్ (ర్యాన్ రెనాల్డ్)ని పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమవుతుంది. సినిమా ప్రారంభంలోనే ర్యాన్ రేనాల్డ్స్, డ్వేన్ జాన్సన్ మధ్య మంచి చేజింగ్, యాక్షన్ సీన్లు వస్తాయి. ఈ సీన్లతో స్టోరీలోకి నిమగ్నమవుతారు ప్రేక్షకులు. ప్రారంభంలోనే కాకుండా సినిమాలో వచ్చిన యాక్షన్ సీన్స్, అడ్వెంచర్స్ ఆకట్టుకుంటాయి. చిత్రాన్ని కేవలం యాక్షన్, చేజింగ్ సీన్స్‌తోనే కాకుండా కామెడీ ఎంటర్టైనర్గా కూడా రూపొందించారు డైరెక్టర్ రాసన్ మార్షల్ థర్బర్. ఈ దర్శకుడు ఈజీ ఏ, డ్వేన్ జాన్సన్‌తో స్కై స్క్రాపర్, డాడ్జ్‌బాల్ వంటి సినిమాలను తెరకెక్కించారు. సినిమాను ఏదో కొత్త తరహా అడ్వెంచర్‌గా ఉండదు. కానీ దొంగతనం నేపథ్యంతోనే యాక్షన్, అడ్వెంచర్స్తోపాటు కమర్షియల్‌గా తెరకెక్కించారు దర్శకుడు రాసన్. సినిమాలో యాక్షన్స్, అడ్వెంచర్స్‌తో పాటు వచ్చే ట్విస్ట్‌లు చాలా ఆకట్టుకుంటాయి. సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్బుతంగా ఉంది. ముగ్గురు స్టార్లను పెట్టి తీసిన డైరెక్టర్ మార్షల్ నిజంగా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. గాల్ గాడోట్, ర్యాన్ రెనాల్డ్స్, డ్వేన్ జాన్సన్ ముగ్గురు కనిపించే ప్రతీ ఫ్రేమ్ సూపర్‌గా ఉంటుంది. వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, కోఆర్డీనేషన్ అదిరిపోయింది. సినిమా ఆద్యంతం ఈ ముగ్గురు చుట్టే తిరుగుతుంది. అలాగే చిత్రంలోని విజువల్స్ చాలా బాగున్నాయి. రెడ్ నోటీస్ నవంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కాగా, నవంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ చిత్రం చివర్లో సీక్వెల్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చూపించారు. ఎవరెలా చేశారంటే..? ముందుగా ర్యాన్ రెనాల్డ్స్ గురించి మాట్లాడుకుంటే తనదైనా కామెడీ టైమింగ్‌తో సినిమా మొత్తం ఎంటర్టైన్ చేస్తాడు. యాక్షన్ సీన్స్‌తోపాటు జైలులో నుంచి తప్పించుకునేందుకే చేసే పనులు ఆకట్టుకుంటాయి. తాను ఉన్న ప్రతీ ఫ్రేమ్ వినోదభరితంగా ఉంటుంది. సినిమా బోర్ కొట్టకుండా ఉండేందుకు తను ప్రధాన కారణమని చెప్పకతప్పదు. ఇక వండర్ వుమెన్ గాల్ గాడోట్ తన అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కేవలం అందంతోనే కాకుండా తెలివైన దొంగగా, యాక్షన్ సీన్లలో అదరగొడుతుంది. గాల్ గాడోట్పై అంచనాలతో చూస్తే తను మిమ్మల్ని కచ్చితంగా నిరాశపరచదు. ఇక గాల్ ఎక్స్ప్రెషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్టార్స్ ముగ్గురు చేసే యాక్షన్ సీన్స్ వావ్ అనిపిస్తాయి. ది రాక్ డ్వేన్ జాన్సన్‌పై మాములుగానే ఎన్నో అంచనాలుంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా తనదైన సెటిల్డ్ పెర్మాఫెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు జాన్సన్. చదవండి: ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమంటున్న 'వండర్ వుమెన్' -
ఈ హాలీవుడ్ హీరోయిన్‌కి ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమట..
Wonder Woman Gal Gadot Loves Indian Food: 'వండర్ వుమెన్' గాల్ గాడోట్, డ్వేన్ జాన్సన్, రేయాన్ రెనాల్డ్స్ కలిసి నటించిన 'రెడ్ నోటీస్' మూవీ సక్సెస్‌లో దూసుకుపోతుంది. ఈ విజయాన్ని ఆనందిస్తున్న గాల్ గాడోట్ ఇటీవల తనకు ఇష్టమైన భారతీయ వంటకాల గురించి చెప్పుకొచ్చింది. ఓటీటీ దిగ్గజమైన నెట్‌ఫ్లిక్స్ షేర్ చేసిన వీడియోలో తనకు వెల్లుల్లి నాన్‌తో చేసిన బటర్ చికెన్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇంకా ఆ వీడియోలో 'నాకు మసాల చికెన్ టిక్కా అంటే చాలా ఇష్టం. కానీ వెల్లుల్లి నాన్‌తో చేసిన బటర్ చికెన్ అంటే చాలా చాలా చాలా ఇష్టం. పెరుగు కూడా ఇష్టమే. నేను భారీతీయ వంటకాలను ఇష్టపడతాను.' అని చెప్పింది. 'రెడ్ నోటీస్'ను ఇంతలా ఆదరించినందుకు సినిమా నటీనటులు కృతజ్ఞతలు తెలిపారు. రాసన్ మార్షల్ థర్బర్ రచించి, దర్శకత్వం వహించిన 'రెడ్ నోటీస్' నవంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. అలాగే నవంబర్ 12న ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. 'రెడ్ నోటీస్' అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్స్‌ను పట్టుకోడానికి ఇంటర్‌పోల్ జారీ చేసే గ్లోబల్ హెచ్చరిక. మోస్ట్ వాంటెడ్ ఆర్ట్ దొంగగా గాల్ గాడోట్ అద్భుతంగా నటించారు. డిస్నీ సంస్థలో రాబోయే లైవ్-యాక్షన్ అడాప్టేషన్ మూవీ 'స్నో వైట్'లో గాడోట్ ఈవిల్ క్వీన్‌గా నటించనుంది. బ్రదర్స్ గ్రిమ్ అద్భుత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
తారల పారితోషికం: ఇది యాపారం!
Hollywood Stars Remuneration: డేనియల్ క్రెయిగ్.. బాండ్ సినిమాలు చూసేవాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 53 ఏళ్ల ఈ బ్రిటిష్ యాక్టర్ తాజాగా భారీ రెమ్యునరేషన్‌తో వార్తల్లో నిలిచాడు. నైవ్స్ అవుట్ సీక్వెల్స్ కోసం ఏకంగా 100 మిలియన్ల డాలర్ల(744 కోట్ల రూపాయల) పారితోషికం నెట్‌ఫ్లిక్స్ నుంచి అందుకున్నాడు డేనియల్ క్రెయిగ్. తద్వారా హాలీవుడ్లో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా(సింగిల్ మూవీ సిరీస్‌తో) నిలిచాడు. ఇది బాండ్ సినిమాలన్నింటి ద్వారా క్రెయిగ్ అందుకున్న రెమ్యునరేషన్ కంటే చాలా ఎక్కువే కావడం విశేషం!.. సినిమా.. ఎప్పటికీ ఓ భారీ వ్యాపారం. అందుకే ఈ కరోనా టైంలో పెద్ద సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కోసం వేచిచూసే ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రతీదాంట్లోనూ అడ్వాన్స్డ్గా ఉండే హాలీవుడ్.. ఇప్పుడు తారల రెమ్యునరేషన్ విషయంలోనూ తొలి అడుగు వేసింది. థియేటర్లకు ఆడియొన్స్ దూరం అవుతున్నారని పసిగట్టి.. ఓటీటీ సర్వీసులతో వ్యూయర్స్‌ను ఎంగేజ్ చేస్తున్నాయి. తారలకు గాలం వేసి సొంత సినిమాలు తీస్తున్నాయి. ఈ క్రమంలో తారల రెమ్యునరేషన్‌ని.. ఇప్పుడు పూర్తి స్థాయి బిజినెస్‌గా మార్చేసింది. నెట్‌ఫ్లిక్స్ ముందంజ సాధారణంగా డిస్నీ, వార్నర్ బ్రదర్స్ లాంటి సంప్రదాయ నిర్మాణ సంస్థలు, తారలకు భారీ పారితోషికాలను ఆఫర్ చేస్తుంటాయి. సినిమాలు రిలీజ్ అయ్యాక డిజిటల్ రైట్స్ కొనుగోలు స్టేజ్ నుంచి నిర్మాణ దశలోనే హక్కులు కొనుక్కునేంత స్థాయికి చేరింది పరిస్థితి. ఇక ఓటీటీ వినియోగం కరోనా వల్ల పెరిగాక.. నేరుగా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాయి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్. ఈ క్రమంలోనే భారీ రెమ్యునరేషన్లతో తారల్ని టెంప్ట్ చేస్తున్నాయి. స్టార్డమ్.. రెమ్యునరేషన్ ఫిక్స్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఇప్పుడు. సినిమా పేరు - నటుడు/నటి - రెమ్యునరేషన్- ఓటీటీ ►నైవ్స్ అవుట్( సీక్వెల్స్)- డెనియల్ క్రెయిగ్ - 744 కోట్లు - నెట్‌ఫ్లిక్స్ ►రెడ్ వన్ - డ్వెయిన్ జాన్సన్ - 372కోట్లు -అమెజాన్ ►డోంట్ లుక్ అప్ - లియోనార్డో డికాప్రియో - 222 కోట్లు -నెట్‌ఫ్లిక్స్ ► " - జెన్నిఫర్ లారెన్స్ - 185 కోట్లు - " ►లీవ్ ది వరల్డ్ బిహైండ్ - జూలియా రాబర్ట్స్ -185 కోట్లు -నెట్‌ఫ్లిక్స్ ►ది గ్రేమ్యాన్ - ర్యాన్ గోస్లింగ్ -148 కోట్లు - నెట్‌ఫ్లిక్స్ మిగతావాటి పరిస్థితి థోర్ సీక్వెల్స్ కోసం నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్, సాండ్రా బుల్లోక్ ‘ది లాస్ట్ సిటీ ఆఫ్ డీ’.. కోసం 148 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఇక వార్నర్ మీడియా వాళ్లు మాత్రం థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ స్ట్రీమింగ్ ఫలితాల ఆధారంగా తారలకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఉదాహరణకు ఒక సినిమా థియేటర్స్-హెచ్‌బీవో మాక్స్‌లో కొద్దిరోజుల గ్యాప్‌తో రిలీజ్ అయితే.. లాభాల ఆధారంగానే రెమ్యునరేషన్‌ను పెంచుతాయి. ఇక రాబర్ట్ పాటిసన్ బ్యాట్మన్ సినిమా కోసం కేవలం 22 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ మాత్రమే ఇస్తున్నారు. ఒకవేళ సినిమా హిట్ అయినా.. ఓటీటీ ద్వారా వ్యూయర్షిప్ దక్కించుకున్నా లేదంటే సీక్వెల్స్‌కు సిద్ధపడినా.. అప్పుడు మాత్రమే పాటిసన్‌కు రెమ్యునరేషన్‌ను పెంచుతారని ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటికే హాలీవుడ్లో పాతుకుపోయిన ఈ రెమ్యునరేషన్ బిజినెస్.. ఓటీటీ జోరు కొనసాగుతున్న తరుణంలో ఈ తరహా పారితోషిక విధానం త్వరలో మన సినిమాకు వ్యాపించే ఛాన్స్ ఉందని సినీ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
1,500 కోట్ల సినిమా.. రిలీజ్ డేట్ వచ్చేసింది
Netflix Red Notice నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సినిమా రెడ్ నోటీస్. కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ హాలీవుడ్ మూవీలో ర్యాన్ రెనాల్డ్స్, గాల్ గాడోట్, డ్వేన్ జాన్సన్, రీతూ ఆర్య లీడ్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. సుమారు 200 మిలియన్ల డాలర్లతో(దాదాపు 1500 కోట్లు) తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు డ్వేన్ జాన్సన్(ది రాక్) తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ద్వారా అనౌన్స్ చేశాడు. అంతేకాదు తమ మీద నమ్మకంతో అంతేసి పెట్టుబడి పెట్టినందుకు నెట్‌ఫ్లిక్స్‌కు థ్యాంక్స్ తెలియజేశాడు. ఈ ఏడాది మోస్ట్ అవెయిటింగ్ మూవీగా అంచనాలు పెంచినందుకు అభిమానులకు, నెటిఫ్లిక్స్ యూజర్లకు సైతం కృతజ్ఞతలు తెలియజేశాడు. కాగా, రాసన్ మార్షల్ థంబర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. దొపిడీ నేపథ్యంతో తెరకెక్కింది. గాడ్గోట్, రెనాల్డ్స్ క్రిమినల్స్‌గా, రాక్ ఎఫ్‌బీఐ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఇక రెడ్ నోటీస్‌లో యాక్షన్ సీన్లకు ఎలాంటి కొదువ ఉండబోదని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. View this post on Instagram A post shared by therock (@therock) -
అమెరికా అధ్యక్షుడిగా ఆ హీరో..!
లాస్ఎంజిల్స్: డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్, హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ (రాక్) అమెరికా అధ్యక్షుడు కావాలని ఆ దేశంలో దాదాపు సగం మంది ప్రజలు కోరుకొంటున్నారట. అదేంటి యూఎస్ అధ్యక్ష ఎన్నికలు ఎప్పడో ముగిశాయి కాదా.. మరి కొత్తగా ఇదేంటి అనుకుంటున్నారా. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ప్రముఖ వ్యక్తులలో ఎవరు ఉండాలనే అంశంపై ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆ సంస్థ అమెరికా ప్రజలను మీకు అధ్యక్షుడిగా డ్వేన్ జాన్సన్ కావాలని కోరుకొంటున్నారా అన్ని ప్రశ్నించగా.. 46 శాతం మంది అమెరికన్లు అవును అని సమాధానమిచ్చారు. ఈ పోల్ ఫలితాన్ని డ్వేన్ జాన్సన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోల్ స్పందనపై రాక్ మాట్లాడుతూ ‘ఒక వేళ నాకు అమెరికా అధ్యక్షునిగా అవకాశం లభిస్తే, అది ప్రజలకు సేవ చేసేందుకు నాకు లభించిన గౌరవంగా భావిస్తాను’ అని అన్నారు. ఇప్పటికే రెజ్లర్‌గా, నటుడిగా పుల్ ఫాలోయింగ్ సంపాదించిన జాన్సన్‌కు అదృష్టం ఉంటే భవిష్యత్తులో అధ్యక్ష పదవి కూడా లభిస్తుందేమో. గతంలోనూ డ్వేన్ జాన్సన్ అమెరికా అధ్యక్ష పదవిపై తనకున్న ఆశను బయటపెట్టారు. 2017లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేయడానికి తాను తీవ్రంగా ప్రయత్నించినట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. ( చదవండి: అమెరికాలో ‘రెడ్‌ఫ్లాగ్ లా’ అమలుకు బైడెన్ కసరత్తు! ) View this post on Instagram A post shared by therock (@therock) -
డ్వేన్ జాన్సన్ కుటుంబానికి కరోనా
రెజ్లింగ్ సూపర్‌స్టార్, హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ కుటుంబానికి (డ్వేన్ జాన్సన్, ఆయన భార్య లారెన్, పిల్లలు టియా, జాసీ) కరోనా సోకింది. ఈ విషయం గురించి తెలుపుతూ, ఓ వీడియో విడుదల చేశారాయన. ‘‘మా కుటుంబానికి ఇదో కష్టతరమైన సమయం. సినిమాల చిత్రీకరణలో చాలా దెబ్బలు తగిలాయి, గాయాలయ్యాయి. కానీ కరోనా భిన్నమైంది. ప్రస్తుతం నా బాధ్యత నా కుటుంబాన్ని కాపాడుకోవడమే. కరోనా నా ఒక్కడికే వచ్చి ఉంటే బావుణ్ణు అనిపిస్తోంది. ప్రస్తుతం అందరం ఆరోగ్యంగానే ఉన్నాం. మీ అందరి ప్రేమ వల్ల త్వరగా కోలుకుంటున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబాన్ని సంరక్షించుకోండి. మీ వ్యాధి నిరోధక శక్తి పెంచుకోండి. అజాగ్రత్తగా వ్యవహరించకండి’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు డ్వేన్ జాన్సన్. -
కరోనా బారిన 'ద రాక్' కుటుంబం
రింగ్‌లో దిగితే తనకు తిరుగు లేదని నిరూపించుకున్న ఫైటర్ 'డ్వేన్ జాన్సన్'. అభిమానులు ఆయన్ను ముద్దుగా "ద రాక్" అని పిలుచుకుంటారు. రెజ్లింగ్ తర్వాత హాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఆయన అక్కడ కూడా తన సత్తా చాటుతున్నారు. తాజాగా ఆయన కుటుంబం కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని డ్వేన్ జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం వీడియో ద్వారా వెల్లడించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. తనతో పాటు కుటుంబానికంతటికీ కరోనా వచ్చిందని తెలిపారు. (చదవండి:ఒక్క పోస్టు కోట్లు కురిపిస్తాయి..) తొలుత ఈ విషయం తనను షాక్‌కు గురి చేసిందన్నారు. అయితే తనతో సహా భార్య లారెన్ హషైన్, ఇద్దరు కూతుళ్లు కరోనా నుంచి కోలుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. మొదట్లో పిల్లలిద్దరికీ కొద్ది రోజుల పాటు గొంతు నొప్పి వచ్చిందన్నారు. ఇప్పడు కరోనాను జయించి ఎప్పటిలానే ఆడుకుంటున్నారని తెలిపారు.ఓ రకంగా చెప్పాలంటే ఇలా జరగడం వల్ల తనకు ఆరోగ్యం మీద మరింత స్పృహ వచ్చిందన్నారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు మాస్కులు ధరించడం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం వంటివి పాటించాలని డ్వేన్ జాన్సన్ అభిమానులకు సూచించారు. (చదవండి:ఈ కేసు విచారణకు అతడు అనర్హుడు: ఏంజెలినా) View this post on Instagram Stay disciplined. Boost your immune system. Commit to wellness. Wear your mask. Protect your family. Be strict about having people over your house or gatherings. Stay positive. And care for your fellow human beings. Stay healthy, my friends. DJ 🖤 #controlthecontrollables A post shared by therock (@therock) on Sep 2, 2020 at 3:26pm PDT -
ఇన్‌స్టాలో ఒక్క పోస్టుకు రూ. 7.59 కోట్లు
హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్.. ఒకప్పుడు రెజ్లింగ్‌లో తన సత్తాను చాటుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అనంతరం సినిమాల్లోనూ ప్రవేశించి స్టార్ నటుడిగా రాణిస్తున్నాడు. ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న డ్వేన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో 189 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థ హ్యాపర్ హెచ్‌క్యూ ప్రకారం.. అతడు అడ్వర్టైజ్మెంట్ల కోసం చేసే ఒక్క పోస్టు ద్వారా 7,59,93,050 కోట్ల రూపాయలు(10,15,000 డాలర్లు) ఆర్జిస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా అత్యధికంగా డబ్బులు గడించే లిస్టులో డ్వేన్ తొలి స్థానంలో నిలిచాడు. (నాకు కరోనా లక్షణాలు లేవు.. కానీ: కైలీ జెన్నర్) నిజానికి ఈ స్థానంలో టీవీ స్టార్, మేకప్ మొఘల్ కైలీ జెన్నర్ ఉండేవారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 184 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఆమె గతేడాది ఒక్క పోస్టుకు 1.2 మిలియన్ అంటే అక్షరాలా ఎనిమిది కోట్లకు పైగా తీసుకున్నారు. కానీ ప్రస్తుతం కాస్త వెనకబడి ఒక్క పోస్టుకు 7,38,21,820 కోట్లు అందుకుంటూ రెండో స్థానానికి పడిపోయారు. తర్వాతి మూడు స్థానాల్లో వరుసగా ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (6,65,59,430 కోట్లు), జెన్నర్ సోదరి కిమ్ కర్దాషియన్ ( 6,42,38,460 కోట్లు), గాయకుడు, గేయ రచయిత అరియానా గ్రాండే (6,38,64,110) ఉన్నారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జుమాంజి వంటి పలు వరల్డ్ హిట్ చిత్రాల్లో నటించిన డ్వేన్ ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 2019లో అత్యధికంగా సంపాదించే హాలీవుడ్ నటుడిగా నిలిచాడు. (అతడు.. ఆమె.. ఓ అన్న!) -
‘డాడీ బెస్ట్’ కాదంటున్న హీరో కూతురు
-
హాలీవుడ్ స్టార్ మాట కాదంటున్న కూతురు
డ్వేన్ జాన్సన్.. డబ్ల్యుడబ్ల్యుఈ రెజ్లర్‌గా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈయన్ని అభిమానులు ముద్దుగా రాక్ అని పిలుచుకుంటారు. అతను తర్వాతి కాలంలో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి హాలీవుడ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తాజాగా తన కూతురు తియానాతో సంభాషించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇందులో జాన్సన్ ఏవి చెప్తే వాటిని తిరిగి అప్పజెప్పాలని తియానాకు సూచించాడు. దీనికి ఆ చిన్నారి సరేనంది. తండ్రి మాటలను పొల్లుపోకుండా అప్పజెప్పింది కూడా. కానీ చివర్లో మాత్రం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. తండ్రి మాటను చెప్పనని మొండికేసింది. దీనికి కారణం లేకపోలేదు. మొదటి నుంచి అతని గారాలపట్టి గురించి పాజిటివ్ అంశాలు చెప్పుకొచ్చాడు. వాటిని ఆమె బుద్ధిగా అప్పజెప్పింది. చివర్లో మాత్రం జాన్సన్ అన్నివైపులా ఓసారి తేరిపార చూసి, తన భార్య అక్కడ లేదని నిర్ధారించుకున్నాక కూతురితో ‘డాడీ ఈజ్ ద బెస్ట్’ అని చెప్పాడు. దానికి ఆమె ఏమీ తత్తరపాటు లేకుండా ‘డాడీ ఈజ్ ద బెస్ట్’ అని చెప్పింది. కానీ వెంటనే ఆ చిన్నిబుర్ర పాదరసంలా పనిచేసి తన తప్పును సవరించుకుని ‘మదర్’ అని గొంతెత్తి అరిచింది. దానికి మన హాలీవుడ్ స్టార్ అంగీకరిస్తాడా? లేదు.. తండ్రి మాత్రమే బెస్ట్ అని చిన్నారితో చెప్పించేందుకు నానాతంటాలు పడ్డాడు. కానీ తియానా మాత్రం దానికి ససేమీరా అంటోంది. ఈ వీడియో ఆయన అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. కాగా జాన్సన్ 1997లో డానీ గార్సియాను వివాహమాడగా 2007లో విడిపోయారు. వీరికి పంతొమ్మిదేళ్ల కూతురు ఉంది. ఆ తర్వాత జాన్సన్ గతేడాది ఆగస్టులో ప్రియురాలు లారెన్ హషియాన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. దాదాపు 12 ఏళ్ల సహజీవనం తర్వాత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. వీరి సంతానమే ఈ చిన్నారి తియానా.