రెజ్లింగ్ సూపర్‌స్టార్, హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ కుటుంబానికి (డ్వేన్ జాన్సన్, ఆయన భార్య లారెన్, పిల్లలు టియా, జాసీ) కరోనా సోకింది. ఈ విషయం గురించి తెలుపుతూ, ఓ వీడియో విడుదల చేశారాయన. ‘‘మా కుటుంబానికి ఇదో కష్టతరమైన సమయం. సినిమాల చిత్రీకరణలో చాలా దెబ్బలు తగిలాయి, గాయాలయ్యాయి. కానీ కరోనా భిన్నమైంది. ప్రస్తుతం నా బాధ్యత నా కుటుంబాన్ని కాపాడుకోవడమే. కరోనా నా ఒక్కడికే వచ్చి ఉంటే బావుణ్ణు అనిపిస్తోంది. ప్రస్తుతం అందరం ఆరోగ్యంగానే ఉన్నాం. మీ అందరి ప్రేమ వల్ల త్వరగా కోలుకుంటున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబాన్ని సంరక్షించుకోండి. మీ వ్యాధి నిరోధక శక్తి పెంచుకోండి. అజాగ్రత్తగా వ్యవహరించకండి’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు డ్వేన్ జాన్సన్.
Comments
Please login to add a commentAdd a comment