
Wonder Woman Gal Gadot Loves Indian Food: 'వండర్ వుమెన్' గాల్ గాడోట్, డ్వేన్ జాన్సన్, రేయాన్ రెనాల్డ్స్ కలిసి నటించిన 'రెడ్ నోటీస్' మూవీ సక్సెస్‌లో దూసుకుపోతుంది. ఈ విజయాన్ని ఆనందిస్తున్న గాల్ గాడోట్ ఇటీవల తనకు ఇష్టమైన భారతీయ వంటకాల గురించి చెప్పుకొచ్చింది. ఓటీటీ దిగ్గజమైన నెట్‌ఫ్లిక్స్ షేర్ చేసిన వీడియోలో తనకు వెల్లుల్లి నాన్‌తో చేసిన బటర్ చికెన్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇంకా ఆ వీడియోలో 'నాకు మసాల చికెన్ టిక్కా అంటే చాలా ఇష్టం. కానీ వెల్లుల్లి నాన్‌తో చేసిన బటర్ చికెన్ అంటే చాలా చాలా చాలా ఇష్టం. పెరుగు కూడా ఇష్టమే. నేను భారీతీయ వంటకాలను ఇష్టపడతాను.' అని చెప్పింది. 'రెడ్ నోటీస్'ను ఇంతలా ఆదరించినందుకు సినిమా నటీనటులు కృతజ్ఞతలు తెలిపారు.
రాసన్ మార్షల్ థర్బర్ రచించి, దర్శకత్వం వహించిన 'రెడ్ నోటీస్' నవంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. అలాగే నవంబర్ 12న ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. 'రెడ్ నోటీస్' అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్స్‌ను పట్టుకోడానికి ఇంటర్‌పోల్ జారీ చేసే గ్లోబల్ హెచ్చరిక. మోస్ట్ వాంటెడ్ ఆర్ట్ దొంగగా గాల్ గాడోట్ అద్భుతంగా నటించారు. డిస్నీ సంస్థలో రాబోయే లైవ్-యాక్షన్ అడాప్టేషన్ మూవీ 'స్నో వైట్'లో గాడోట్ ఈవిల్ క్వీన్‌గా నటించనుంది. బ‍్రదర్స్ గ్రిమ్ అద్భుత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.