red notice
-
హసీనా కోసం ఇంటర్‌పోల్ సాయం కోరుతాం: బంగ్లాదేశ్ ప్రభుత్వం
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను భారతదేశం నుంచి స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్‌పోల్ సహాయం కోరనున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. పలు నేరారోపణలపై విచారణను ఎదుర్కొనేందుకు ఆమెను బంగ్లా రప్పించేందుకు అక్కడి సిద్ధమైంది. 77 ఏళ్ల అవామీ లీగ్ చీఫ్, ఆమె పార్టీ నాయకులు విపక్ష-వ్యతిరేక విద్యార్థుల ఉద్యమాన్ని క్రూరంగా అణిచివేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇక.. దీని ఫలితంగా జూలై-ఆగస్టులో విద్యర్థుల నిరసనల సందర్భంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్యమం కాస్త పెద్ద ఎత్తున తిరుగుబాటుకు దారితీయటంతో ఆగస్టు 5న హసీనా రహస్యంగా భారతదేశానికి పారిపోవాల్సి వచ్చింది.మరోవైపు..విద్యార్థుల నిరసనల సందర్భంగా కనీసం 753 మంది మరణించగా.. వేలాది మంది గాయపడ్డారని ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. హసీనా, ఆమె అవామీ లీగ్ నాయకులపై అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్, ప్రాసిక్యూషన్ బృందానికి అక్టోబర్‌లో పలు నేరాలు, మారణహోమంపై 60కి పైగా ఫిర్యాదులు దాఖలు అయ్యాయని బంగ్లా ప్రభుత్వం పేర్కొంది.‘‘త్వరలో ఇంటర్‌పోల్ ద్వారా హసీనాకు రెడ్ నోటీసు జారీ చేయనున్నాం. పారిపోయిన ఫాసిస్టులు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నప్పటికీ.. తిరిగి బంగ్లాకు తీసుకువచ్చి కోర్టులో నెలబెడతాం’’ అని న్యాయ వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారుల ప్రకారం.. రెడ్ నోటీసు అనేది అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ కాదు. అప్పగించడం, లొంగిపోవడం లేదా చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్న వ్యక్తిని గుర్తించి, తాత్కాలికంగా అరెస్టు చేయాలని చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు పెట్టుకొనే అభ్యర్థన మాత్రమే. ఇక.. ఇంటర్‌పోల్ సభ్య దేశాలు తమ జాతీయ చట్టాల ప్రకారం రెడ్ నోటీసులను అమలు చేస్తాయని అధికారులు తెలిపారు.చదవండి: రష్యాకు ‘అక్టోబర్’ షాక్.. రోజుకు 1500 మంది సైనికుల మృతి! -
రిలీజైన నెలలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ఓటీటీ సిత్రాలు..
Top 10 Most Viewed Netflix Movies In One Month: విభిన్నమైన కథాంశాలతో ఉన్న చిత్రాలను చూడాలనుకునే మూవీ లవర్స్‌కు, ఆడియెన్స్‌కు ఓటీటీలు బెస్ట్ ఆప్షన్‌గా మారాయి. ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకున్న ఓటీటీ దిగ్గజ సంస్థలు డిఫరెంట్ కథలతో వెబ్ సిరీస్‌లు, సినిమాలు చిత్రీకరిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్. ఈ సంస్థ విభిన్నమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఎప్పుడూ సరికొత్త హంగులతో ఆడియెన్స్‌కు బోర్ కొట్టించకుండా కొత్తదనంలో ఆకట్టుకుంటోంది. ఇక నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ రూపొందించిన అనేక చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సినీ ప్రేమికులను అలరించాయి. అందులో విడుదలైన మొదటి నెలలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ఈ టాప్ 10 మూవీస్ సినీ లవర్స్ కోసం అందిస్తున్నాం. ఇక ఒక్కో చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి మరి. 1. రెడ్ నోటీస్- 129 మిలియన్ వ్యూస్ (4 నవంబర్ 2021) 2. ఎక్స్ట్రాక్షన్- 99 మిలియన్ వ్యూస్ (24 ఏప్రిల్ 2020) 3. బర్డ్ బాక్స్- 89 మిలియన్ వ్యూస్ (14 డిసెంబర్ 2018) 4. స్పెన్సర్ కాన్ఫిడెన్షియల్- 85 మిలియన్ వ్యూస్ (6 మార్చి 2020) 5. 6 అండర్ గ్రౌండ్- 83 మిలియన్ వ్యూస్ (10 డిసెంబర్ 2019) 6. మర్డర్ మిస్టరీ- 83 మిలియన్ వ్యూస్ (14 జూన్ 2019) 7. ది ఓల్డ్ గార్డ్- 78 మిలియన్ వ్యూస్ (10 జూలై 2020) 8. ఎనోలా హోమ్స్- 76 మిలియన్ వ్యూస్ (23 సెప్టెంబర్ 2020) 9. ప్రాజెక్ట్ పవర్- 75 మిలియన్ వ్యూస్ (14 ఆగస్టు 2020) 10. ఆర్మీ ఆఫ్ ది డెడ్- 75 మిలియన్ వ్యూస్ (21 మార్చి 2021) -
'రెడ్ నోటీస్' హాలీవుడ్ మూవీ రివ్యూ
టైటిల్: రెడ్ నోటీస్ నటీనటులు: డ్వేన్ జాన్సన్, ర్యాన్ రెనాల్డ్స్, గాల్ గాడోట్, రితు ఆర్య కథ, దర్శకత్వం: రాసన్ మార్షల్ థర్బర్ సంగీత దర్శకుడు: స్టీవ్ జాబ్లోన్స్కీ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ దొంగతనం నేపథ్యంలో వచ్చే సినిమాలంటే ఇష్టపడనివారు ఉండరు. స్టైలిష్‌గా దొంగతనం చేయడం, పోలీసుల చేజింగ్‌లు ఆసక్తికరంగా ఉంటాయి. బాలీవుడ్లో వచ్చిన 'ధూమ్' సిరీస్ నుంచి రీసెంట్గా హాలీవుడ్ వెబ్ సిరీస్ 'మనీ హీస్ట్' వరకు ఆసక్తికరంగా ఉండేది ఈ అంశాలే. ఈ కథాంశంగా ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం 'రెడ్ నోటీస్'. ది రాక్ డ్వేన్ జాన్సన్, డెడ్‌పూల్ ర్యాన్ రెనాల్డ్స్, వండర్ వుమెన్ గాల్ గాడోట్ వంటి హాలీవుడ్ స్టార్లతో రూపొందిందీ చిత్రం. 160 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మరి ఎంతవరకు సక్సెస్ అయిందో చూద్దామా..! కథ: ఈజిప్ట్ రాణి అయిన క్లియోపాత్ర వివాహానికి తన తండ్రి పెళ్లి బహుమతిగా 3 ఎగ్స్‌ని ఇస్తాడు. కొంత కాలం తర్వాత ఆ 3 ఎగ్స్ మూడు వివిధ ప్రాంతాల్లో ఉంటాయి. ఆ ఎగ్స్‌ను కొట్టేయడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ట్స్ (కళాఖండాలు) దొంగలుగా పేరొందిన బిషప్ (గాల్ గాడోట్), నోలన్ బూత్ (ర్యాన్ రెనాల్డ్) ఏ విధంగా కష్టపడ్డారు. ఎలా ఒకరిపై ఒకరు ఎత్తుగడలు వేశారు. వారికి ఎవరెవరూ సహాయం చేశారు. ఈ దొంగతనాన్ని ఎఫ్‌బీఐ ప్రత్యేక ఏజెంట్ జాన్ హార్ట్లీ (డ్వేన్ జాన్సన్) ఎలా అడ్డుకున్నాడు? వారితో ఎందుకు చేతులు కలిపి పని చేయాల్సి వచ్చింది ? అనేదే 'రెడ్ నోటీస్' కథ. విశ్లేషణ: ప్రపంచంలోనే రెండవ అత్యుత్తమ ఆర్ట్స్ దొంగ అయిన నోలన్ బూత్ (ర్యాన్ రెనాల్డ్)ని పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమవుతుంది. సినిమా ప్రారంభంలోనే ర్యాన్ రేనాల్డ్స్, డ్వేన్ జాన్సన్ మధ్య మంచి చేజింగ్, యాక్షన్ సీన్లు వస్తాయి. ఈ సీన్లతో స్టోరీలోకి నిమగ్నమవుతారు ప్రేక్షకులు. ప్రారంభంలోనే కాకుండా సినిమాలో వచ్చిన యాక్షన్ సీన్స్, అడ్వెంచర్స్ ఆకట్టుకుంటాయి. చిత్రాన్ని కేవలం యాక్షన్, చేజింగ్ సీన్స్‌తోనే కాకుండా కామెడీ ఎంటర్టైనర్గా కూడా రూపొందించారు డైరెక్టర్ రాసన్ మార్షల్ థర్బర్. ఈ దర్శకుడు ఈజీ ఏ, డ్వేన్ జాన్సన్‌తో స్కై స్క్రాపర్, డాడ్జ్‌బాల్ వంటి సినిమాలను తెరకెక్కించారు. సినిమాను ఏదో కొత్త తరహా అడ్వెంచర్‌గా ఉండదు. కానీ దొంగతనం నేపథ్యంతోనే యాక్షన్, అడ్వెంచర్స్తోపాటు కమర్షియల్‌గా తెరకెక్కించారు దర్శకుడు రాసన్. సినిమాలో యాక్షన్స్, అడ్వెంచర్స్‌తో పాటు వచ్చే ట్విస్ట్‌లు చాలా ఆకట్టుకుంటాయి. సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్బుతంగా ఉంది. ముగ్గురు స్టార్లను పెట్టి తీసిన డైరెక్టర్ మార్షల్ నిజంగా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. గాల్ గాడోట్, ర్యాన్ రెనాల్డ్స్, డ్వేన్ జాన్సన్ ముగ్గురు కనిపించే ప్రతీ ఫ్రేమ్ సూపర్‌గా ఉంటుంది. వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, కోఆర్డీనేషన్ అదిరిపోయింది. సినిమా ఆద్యంతం ఈ ముగ్గురు చుట్టే తిరుగుతుంది. అలాగే చిత్రంలోని విజువల్స్ చాలా బాగున్నాయి. రెడ్ నోటీస్ నవంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కాగా, నవంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ చిత్రం చివర్లో సీక్వెల్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చూపించారు. ఎవరెలా చేశారంటే..? ముందుగా ర్యాన్ రెనాల్డ్స్ గురించి మాట్లాడుకుంటే తనదైనా కామెడీ టైమింగ్‌తో సినిమా మొత్తం ఎంటర్టైన్ చేస్తాడు. యాక్షన్ సీన్స్‌తోపాటు జైలులో నుంచి తప్పించుకునేందుకే చేసే పనులు ఆకట్టుకుంటాయి. తాను ఉన్న ప్రతీ ఫ్రేమ్ వినోదభరితంగా ఉంటుంది. సినిమా బోర్ కొట్టకుండా ఉండేందుకు తను ప్రధాన కారణమని చెప్పకతప్పదు. ఇక వండర్ వుమెన్ గాల్ గాడోట్ తన అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కేవలం అందంతోనే కాకుండా తెలివైన దొంగగా, యాక్షన్ సీన్లలో అదరగొడుతుంది. గాల్ గాడోట్పై అంచనాలతో చూస్తే తను మిమ్మల్ని కచ్చితంగా నిరాశపరచదు. ఇక గాల్ ఎక్స్ప్రెషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్టార్స్ ముగ్గురు చేసే యాక్షన్ సీన్స్ వావ్ అనిపిస్తాయి. ది రాక్ డ్వేన్ జాన్సన్‌పై మాములుగానే ఎన్నో అంచనాలుంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా తనదైన సెటిల్డ్ పెర్మాఫెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు జాన్సన్. చదవండి: ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమంటున్న 'వండర్ వుమెన్' -
ఈ హాలీవుడ్ హీరోయిన్‌కి ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమట..
Wonder Woman Gal Gadot Loves Indian Food: 'వండర్ వుమెన్' గాల్ గాడోట్, డ్వేన్ జాన్సన్, రేయాన్ రెనాల్డ్స్ కలిసి నటించిన 'రెడ్ నోటీస్' మూవీ సక్సెస్‌లో దూసుకుపోతుంది. ఈ విజయాన్ని ఆనందిస్తున్న గాల్ గాడోట్ ఇటీవల తనకు ఇష్టమైన భారతీయ వంటకాల గురించి చెప్పుకొచ్చింది. ఓటీటీ దిగ్గజమైన నెట్‌ఫ్లిక్స్ షేర్ చేసిన వీడియోలో తనకు వెల్లుల్లి నాన్‌తో చేసిన బటర్ చికెన్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇంకా ఆ వీడియోలో 'నాకు మసాల చికెన్ టిక్కా అంటే చాలా ఇష్టం. కానీ వెల్లుల్లి నాన్‌తో చేసిన బటర్ చికెన్ అంటే చాలా చాలా చాలా ఇష్టం. పెరుగు కూడా ఇష్టమే. నేను భారీతీయ వంటకాలను ఇష్టపడతాను.' అని చెప్పింది. 'రెడ్ నోటీస్'ను ఇంతలా ఆదరించినందుకు సినిమా నటీనటులు కృతజ్ఞతలు తెలిపారు. రాసన్ మార్షల్ థర్బర్ రచించి, దర్శకత్వం వహించిన 'రెడ్ నోటీస్' నవంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. అలాగే నవంబర్ 12న ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. 'రెడ్ నోటీస్' అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్స్‌ను పట్టుకోడానికి ఇంటర్‌పోల్ జారీ చేసే గ్లోబల్ హెచ్చరిక. మోస్ట్ వాంటెడ్ ఆర్ట్ దొంగగా గాల్ గాడోట్ అద్భుతంగా నటించారు. డిస్నీ సంస్థలో రాబోయే లైవ్-యాక్షన్ అడాప్టేషన్ మూవీ 'స్నో వైట్'లో గాడోట్ ఈవిల్ క్వీన్‌గా నటించనుంది. బ్రదర్స్ గ్రిమ్ అద్భుత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
1,500 కోట్ల సినిమా.. రిలీజ్ డేట్ వచ్చేసింది
Netflix Red Notice నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సినిమా రెడ్ నోటీస్. కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ హాలీవుడ్ మూవీలో ర్యాన్ రెనాల్డ్స్, గాల్ గాడోట్, డ్వేన్ జాన్సన్, రీతూ ఆర్య లీడ్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. సుమారు 200 మిలియన్ల డాలర్లతో(దాదాపు 1500 కోట్లు) తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు డ్వేన్ జాన్సన్(ది రాక్) తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ద్వారా అనౌన్స్ చేశాడు. అంతేకాదు తమ మీద నమ్మకంతో అంతేసి పెట్టుబడి పెట్టినందుకు నెట్‌ఫ్లిక్స్‌కు థ్యాంక్స్ తెలియజేశాడు. ఈ ఏడాది మోస్ట్ అవెయిటింగ్ మూవీగా అంచనాలు పెంచినందుకు అభిమానులకు, నెటిఫ్లిక్స్ యూజర్లకు సైతం కృతజ్ఞతలు తెలియజేశాడు. కాగా, రాసన్ మార్షల్ థంబర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. దొపిడీ నేపథ్యంతో తెరకెక్కింది. గాడ్గోట్, రెనాల్డ్స్ క్రిమినల్స్‌గా, రాక్ ఎఫ్‌బీఐ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఇక రెడ్ నోటీస్‌లో యాక్షన్ సీన్లకు ఎలాంటి కొదువ ఉండబోదని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. View this post on Instagram A post shared by therock (@therock) -
బకాయిదారులకు ‘రెడ్‌నోటీస్’
తాండూరు: పేరుకుపోయిన ఆస్తి(ఇంటి) పన్ను వసూలుకు తాండూరు మున్సిపల్ అధికారులు సిద్ధమవుతున్నారు. మూడేళ్లుగా ఆస్తిపన్ను చెల్లించని భవన యజమానులకు నేటి నుంచి ‘రెడ్ నోటీసు’ జారీ చేయాలని నిర్ణయించారు. బకాయిల జాబితాలో పలు ప్రభుత్వ కార్యాలయాలూ ఉన్నాయి. ఆస్తి పన్ను వసూలుపై ఆయా శాఖలకు మున్సిపల్ అధికారులు లేఖలు పంపించనున్నారు. భవన యజమానులు రెడ్ నోటీసు అందుకున్న మూడు రోజుల్లో బకాయి మొత్తం చెల్లించని పక్షంలో పురపాలక చట్టం 1965 అండర్ సెక్షన్-90, 91 షెడ్యూల్-2 రూల్(30) ప్రకారం స్థిరాస్తులు జప్తు చేయాలని అధికారులు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. తాండూరు పురపాలక సంఘం పరిధిలో సుమారు 7,500 అసెస్మెంట్ గృహాలు, వ్యాపార సముదాయులు, సినిమా హాళ్లు ఉన్నాయి. రూ.50.56 లక్షల పాత బకాయితోపాటు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలలో ఇప్పటివరకు రూ.96.50 లక్షల ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఆగస్టు వరకు పాత బకాయిలో రూ.5.69 లక్షలు, సాధారణ వసూళ్లు ఈ నెలలో ఇప్పటివరకు రూ.25.83 లక్షలు కలుపుకుని మొత్తం రూ.31.52లక్షలు మాత్రమే ఆస్తిపన్ను వసూలైంది. ఇంకా సుమారు రూ.కోటీ 14 లక్షల 48 వేల ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉంది. మొత్తం బకాయిల్లో సాగునీటి పారుదల శాఖ, ఆర్అండ్బీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ, అటవీ శాఖ నుంచి సుమారు రూ.35లక్షల వరకు రావాలి. మూడేళ్లుగా మొండి బకాయి రూ.30లక్షల వరకు ఉందని అంచనా. ఇందులో పట్టణంలోని మూడు సినిమా హాళ్లు సుమారు రూ.9 లక్షల వరకు, నేషనల్ గార్డెన్ నుంచి రూ.లక్ష బకాయి ఉందని అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలిక ఆస్తిపన్ను బకాయిదారులందరికీ శుక్రవారం నుంచి రెడ్‌నోటీసులు జారీ చేయనున్నారు. ఈ నోటీసులు అందుకున్న మూడు రోజుల్లో బకాయిలు చెల్లించకపోతే పురపాలక చట్టం ప్రకారం టీవీ, ప్రిజ్ తదితర తరలించే వీలున్న వస్తువులను జప్తు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. తాండూరులోని 8 రెవెన్యూ బ్లాక్‌ల పరిధిలో సుమారు రెండు వేల మందికి రెడ్ నోటీసులను సిద్ధం చేసినట్ట్టు అధికార వర్గాల సమాచారం. నేటి నుంచి బిల్ కలెక్టర్లు బకాయిదారులకు నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. మూడు రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే సదరు బకాయిదారుడి ఇంటికి నల్లా కనెక్షన్ కట్ చేయాలని అధికారులు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. -
వినియోగదారులపై ‘రెడ్ నోటీసుల’ కొరడా
=నీటి సరఫరాపై అందుతున్న ఫిర్యాదులపై మౌనం =ఆదాయం పెంపుపైనే జలమండలి దృష్టి =ఇప్పటికే ఐదు వేల నోటీసుల జారీ =మరో వారంలో బకాయిదారులందరికీ తాఖీదులు సాక్షి, సిటీబ్యూరో: అరకొర మంచినీటి సరఫరా.. అస్తవ్యస్త పైప్లైన్లు.. ఎక్కడికక్కడే లీకేజీలు.. సరఫరా నష్టాలు.. వెరసి జలమండలి తీరుతో ‘గ్రేటర్’ వినియోగదారుల కష్టాలు వర్ణనాతీతం. ఇవేం పట్టని జలమండలి ఆదాయం పెంచుకోవడం కోసం మాత్రం తెగ తాపత్రయ పడుతోంది. గ్రేటర్లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల్లో ఇప్పటికీ సుమారు ఐదు వందల కాలనీలకు వారం పదిరోజులకోమారే మంచినీటి సరఫరా జరుగుతున్నా పట్టని జలమండలి.. వినియోగదారులపై రెడ్‌నోటీసుల కొరడా ఝళిపిస్తోంది. రెండు నెలలుగా నీటిబిల్లు బకాయిపడిన వారికి రెడ్‌నోటీసులిచ్చి వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. జలమండలి పరిధిలోని 16 నిర్వహణ డివిజన్ల పరిధిలో ఇప్పటివరకు ఐదువేల రెడ్నోటీసులిచ్చిన బోర్డు.. మరో వారంలో బకాయిదారులందరికీ నోటీసులివ్వాలని సంకల్పించినట్లు సమాచారం. కనీసం రెండు రోజులకోమారైనా మంచినీటిని సరఫరా చేయాలని కోరుతూ వినియోగదారులు చేస్తున్న ఫిర్యాదులను పట్టించుకోకుండా కేవలం రెవెన్యూ ఆదాయంపైనే దృష్టిపెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయ జపం జలమండలి ఇపుడు ఆదాయమంత్రం జపిస్తోంది. ఇటీవల వాణిజ్య, పరిశ్రమలకున్న కనెక్షన్లకు రెట్టింపు స్థాయిలో బిల్లులు వడ్డించి ఏటా రూ.324 కోట్లు సొమ్ము చేసుకోవాలని లక్ష్యం పెట్టుకున్న బోర్డు.. ఇపుడు గృహవినియోగదారులపై పడింది. నీటిబిల్లు బకాయి పడితే చాలు వారికి రెడ్ నోటీసులు ఇస్తామంటూ హడావుడి చేస్తోంది. అప్పటికీ దిగిరాకుంటే కుళాయి కనెక్షన్ తొలగించడంతోపాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి చరాస్తులు జప్తు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తామని కలకలం సృష్టిస్తోంది. గత పక్షం రోజులుగా డివిజన్ల వారీగా బోర్డు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా రెవెన్యూ సమీక్షా సమావేశాలు నిర్వహించి ఈ మేరకు సిబ్బందికి దిశానిర్దేశం కూడా చేశారు. కాగా జలమండలికి ప్రతినెలా నీటిబిల్లుల ద్వారా రూ.56 కోట్ల మేర ఆదాయం సమకూరుతోంది. దీన్ని మరో పదికోట్లకు పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు బోర్డు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అయితే పలు ప్రభుత్వ కార్యాలయాలు, మూతపడిన ప్రభుత్వ రంగ సంస్థలకున్న బకాయిలపై దృష్టిపెట్టని జలమండలి కేవలం గృహవినియోగదారులను లక్ష్యం చేసుకోవడంపైనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు బోర్డుకు సుదీర్ఘకాలంగా లక్ష రూపాయలకు పైగా నీటిబిల్లు బకాయిపడిన 575 మొండి బకాయిదారుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేష్టలుడిగి చూస్తుండడం గమనార్హం. సరఫరాపై మౌనం.. అరకొర నీటిసరఫరా, వేళాపాళా లేకుండా వస్తున్న నీళ్లతో పలు శివారు ప్రాంతాలు విలవిల్లాడుతున్నా జలమండలికి పట్టడం లేదు. కుత్బుల్లాపూర్, కాప్రా, మల్కాజ్గిరి, ఎల్బీనగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, పటాన్చెరువు, ఉప్పల్, బాలానగర్‌ల పరిధిలోని సుమారు 500 కాలనీలకు ఇప్పటికీ వారం, పదిరోజులకోమారు మాత్రమే కుళాయిలు పనిచేస్తున్నాయి. అదీ పట్టుమని పది బిందెలు నిండకుండానే నల్లాలు ఆగిపోతున్నాయి. ఈ సమస్యలపై ప్రతివారం డివిజన్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వందలాదిగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదు.