ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను భారతదేశం నుంచి స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్‌పోల్ సహాయం కోరనున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. పలు నేరారోపణలపై విచారణను ఎదుర్కొనేందుకు ఆమెను బంగ్లా రప్పించేందుకు అక్కడి సిద్ధమైంది. 77 ఏళ్ల అవామీ లీగ్ చీఫ్, ఆమె పార్టీ నాయకులు విపక్ష-వ్యతిరేక విద్యార్థుల ఉద్యమాన్ని క్రూరంగా అణిచివేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇక.. దీని ఫలితంగా జూలై-ఆగస్టులో విద్యర్థుల నిరసనల సందర్భంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్యమం కాస్త పెద్ద ఎత్తున తిరుగుబాటుకు దారితీయటంతో ఆగస్టు 5న హసీనా రహస్యంగా భారతదేశానికి పారిపోవాల్సి వచ్చింది.
మరోవైపు..విద్యార్థుల నిరసనల సందర్భంగా కనీసం 753 మంది మరణించగా.. వేలాది మంది గాయపడ్డారని ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. హసీనా, ఆమె అవామీ లీగ్ నాయకులపై అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్, ప్రాసిక్యూషన్ బృందానికి అక్టోబర్‌లో పలు నేరాలు, మారణహోమంపై 60కి పైగా ఫిర్యాదులు దాఖలు అయ్యాయని బంగ్లా ప్రభుత్వం పేర్కొంది.
‘‘త్వరలో ఇంటర్‌పోల్ ద్వారా హసీనాకు రెడ్ నోటీసు జారీ చేయనున్నాం. పారిపోయిన ఫాసిస్టులు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నప్పటికీ.. తిరిగి బంగ్లాకు తీసుకువచ్చి కోర్టులో నెలబెడతాం’’ అని న్యాయ వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారుల ప్రకారం.. రెడ్ నోటీసు అనేది అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ కాదు. అప్పగించడం, లొంగిపోవడం లేదా చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్న వ్యక్తిని గుర్తించి, తాత్కాలికంగా అరెస్టు చేయాలని చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు పెట్టుకొనే అభ్యర్థన మాత్రమే. ఇక.. ఇంటర్‌పోల్ సభ్య దేశాలు తమ జాతీయ చట్టాల ప్రకారం రెడ్ నోటీసులను అమలు చేస్తాయని అధికారులు తెలిపారు.
చదవండి: రష్యాకు ‘అక్టోబర్’ షాక్.. రోజుకు 1500 మంది సైనికుల మృతి!
Comments
Please login to add a commentAdd a comment